మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'విశ్వంభర' చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. వశిష్ట దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ మూవీ టీజర్ విడుదలైనప్పుడు, అందులోని పేలవమైన సిజిఐ (CGI) పట్ల మెగా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మూవీ టీమ్ ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, లోపాలను సరిదిద్దే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
కెమెరామ్యాన్‌కు సంబంధం లేదు

ఇటీవల వదలా అనే ఓ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో 'విశ్వంభర' వంటి గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పాత్ర గురించి ఛోటా కె. నాయుడిని ప్రశ్నించారు. దీనికి అతడు సూటిగా స్పందించాడు. "అక్కడ పని చేసే డిఓపి (DOP) ఎవరనేది ముఖ్యం కాదు, సిజిఐ టెక్నీషియన్ చెప్పిందే ఫైనల్. గ్రాఫిక్స్ బాగున్నా లేకపోయినా దానికి కెమెరామెన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్లకు ఏం కావాలో అడిగి తెలుసుకుని, దానికి అనుగుణంగానే మేము పని చేస్తాం" అని స్పష్టం చేశాడు.
గతంలో తాను 'అంజి', 'డమరుకం' వంటి భారీ గ్రాఫిక్స్ చిత్రాలకు పని చేసినప్పటికీ, ఈ విషయంలో తాను మేధావినని చెప్పుకోనని అతడు అన్నాడు. "ఒక్కోసారి లైటింగ్ సరిగ్గా లేకపోయినా, సిజిఐ నిపుణులు చెప్పినట్లే మేము వినాల్సి ఉంటుంది. అది తప్పని తెలిసినా మేము ఏమీ చెప్పం. ఎందుకంటే అవుట్‌పుట్ సరిగ్గా రాకపోతే, కెమెరామెన్ మాకు సహకరించలేదని వాళ్లు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది" అని తనలోని ఆవేదనను వెల్లడించాడు.
400 కోట్ల బడ్జెట్.. భారీ బాధ్యత
చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమాను సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా చోటా కే నాయుడు వెల్లడించాడు. ఇంత పెద్ద ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు వ్యక్తిగత అహంకారాలకు చోటు ఉండకూడదని ఛోటా పేర్కొన్నాడు. అందుకే అంజిలాంటి సినిమాకు తల ఎత్తుకొని పని చేస్తే.. విశ్వంభరకు మాత్రం తల దించుకొని పని చేస్తున్నట్లు చెప్పాడు.
{{/usCountry}}చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమాను సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా చోటా కే నాయుడు వెల్లడించాడు. ఇంత పెద్ద ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు వ్యక్తిగత అహంకారాలకు చోటు ఉండకూడదని ఛోటా పేర్కొన్నాడు. అందుకే అంజిలాంటి సినిమాకు తల ఎత్తుకొని పని చేస్తే.. విశ్వంభరకు మాత్రం తల దించుకొని పని చేస్తున్నట్లు చెప్పాడు.
{{/usCountry}}"గ్రాఫిక్స్ నాణ్యత సరిగ్గా లేకపోతే చివరకు నిందలు పడేది మేమే. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ (VFX) ఎక్కువగా ఉండే సినిమాల్లో సెట్స్ మీదే ఒక ప్రత్యేక సిజిఐ టెక్నీషియన్ ఉంటారు. షూటింగ్ అంతా ఆయన మా వెంటే ఉన్నారు. సినిమా కోసం పూర్తి అంకితభావంతో పని చేశాం. ప్రేక్షకులకు అత్యుత్తమ అవుట్‌పుట్ అందించాలనే ఉద్దేశంతోనే మూవీ టీమ్ ఇప్పుడు సమయం తీసుకుంటోంది" అని అతడు వివరించాడు.
టీజర్ విషయంలో వచ్చిన విమర్శలను స్ఫూర్తిగా తీసుకున్న మూవీ టీమ్.. వెండితెరపై మెగాస్టార్‌ను అద్భుతంగా చూపించేందుకు శ్రమిస్తోంది. సోషియో-ఫాంటసీ జానర్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.