...
...
Next Story

Chitti Chitti Cheema: దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. చిట్టి చిట్టి చీమ అంటూ సాగే మెలోడీ

Chitti Chitti Cheema Song: దుల్కర్ సల్మాన్, పవన్ సాదినేని కాంబినేషన్ లో వస్తున్న ఆకాశంలో ఒక తార మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ చిట్టి చిట్టి చీమ సాంగ్ వచ్చేసింది. మంచి మెలోడీతో ఈ పాట ఇన్‌స్టాంట్ చార్ట్‌బస్టర్ అయింది.

Published on: Jul 28, 2026, 18:47:02 IST
By
Prefer HTon Google
Advertisement

Chitti Chitti Cheema Song: మోస్ట్ టాలెంటెడ్ పాన్-ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) బర్త్‌డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే బహుమతి ఇచ్చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'చిట్టి చిట్టి చీమ' సాంగ్‌ను అధికారికంగా విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ఈ సోల్ ఫుల్ మెలోడీ ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. గ్లింప్స్‌తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్ర బృందం, ఇప్పుడు ఈ పాటతో ప్రమోషన్ల జోరును పెంచేసింది.

స్ఫూర్తి నింపే లిరిక్స్.. మనసును తాకే ఎమోషన్

Chitti Chitti Cheema: దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. చిట్టి చిట్టి చీమ అంటూ సాగే మెలోడీ
Chitti Chitti Cheema: దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. చిట్టి చిట్టి చీమ అంటూ సాగే మెలోడీ

ఆకాశంలో ఒక తార మూవీ నుంచి వచ్చిన ఈ పాట వింటుంటేనే ఒక అద్భుతమైన ఎమోషనల్ ఫీల్ కలుగుతోంది. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని పెద్ద కలలు కనే ఒక సాధారణ యువతి ఆశయాలు, ఆమె ప్రయాణంలో వెన్నుదన్నుగా నిలిచే భాగస్వామి పట్ల ఉండే ప్రేమాభిమానాలను ఈ పాటలో చాలా చక్కగా ఆవిష్కరించారు.

'చిట్టి చీమ' ఉదాహరణతో పట్టుదలను, ప్రేరణను ప్రతిబింబించేలా ఈ ట్రాక్ సాగుతుంది. ప్రముఖ గేయ రచయిత శ్రీమణి అందించిన లిరిక్స్ ప్రతీ ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ప్రతి పదం చాలా అర్థవంతంగా కుదిరింది.

రమ్య బెహరా గాత్రం.. జీవీ ప్రకాష్ మ్యాజిక్

ఇక ప్రముఖ గాయని రమ్య బెహరా తన మధురమైన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోశారనే చెప్పాలి. పాటలోని ప్రతి నోట్ ఒక ఎమోషనల్ ఫ్లోను క్రియేట్ చేస్తూ, వినేకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ఆకట్టుకునే మెలోడీ ట్యూన్ ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. సోషల్ మీడియాలో రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే ఈ పాట ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరిపోయింది.

కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దుల్కర్

ఇప్పుడు 'ఆకాశంలో ఒక తార' సినిమా కూడా అదే లీగ్‌లో ఒక ప్యూర్ హ్యూమన్ డ్రామాగా రాబోతున్నట్లు ఈ పాట స్పష్టం చేస్తోంది. దుల్కర్ పక్కన సాత్వికా వీరవల్లి కథానాయికగా నటిస్తుండగా, గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు.

పవన్ సాదినేని విజన్..

'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి' సినిమాలతో పాటు ఓటీటీలో రీసెంట్‌గా సంచలనం సృష్టించిన 'దయా' (Dayaa) వెబ్ సిరీస్‌తో తన మార్క్ చూపించిన పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్ట్రోనాట్ కావాలనే ఓ గ్రామీణ అమ్మాయి కల, దానికి దుల్కర్ ఇచ్చే సైలెంట్ సపోర్ట్ చుట్టూ ఈ కథ సాగుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్యా గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ బర్త్‌డే కానుకగా వచ్చిన 'చిట్టి చిట్టి చీమ' సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe