...
...
Next Story

OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన రాజీవ్ కనకాల ‘చిట్టి తల్లి’.. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో తండ్రీకూతురు ఎమోషనల్ మూవీ

OTT Telugu: సండే స్పెషల్ గా ఓ స్పెషల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. చిట్టి తల్లి మూవీ ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రీకూతురు మధ్య అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. రాజీవ్ కనకాల లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం.

Published on: Apr 12, 2026, 09:01:21 IST
Advertisement

OTT Telugu: తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఇవాళ ఓ స్పెషల్ మూవీ వచ్చేసింది. ఓ చిన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా పేరు.. ‘చిట్టి తల్లి’. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ఆదివారం (ఏప్రిల్ 12) నేరుగా ఓటీటీలో రిలీజైంది.

చిట్టి తల్లి ఓటీటీ

ఓటీటీలోకి తెలుగు సినిమా (x/etvwin)
ఓటీటీలోకి తెలుగు సినిమా (x/etvwin)

రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిట్టి తల్లి సినిమా ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సండే స్పెషల్ గా ఈ చిట్టి తల్లి షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ చిన్న సినిమాలో రాజీవ్ కనకాలతో పాటు మోనిక, అనిరుధ్, నంద కిశోర్ తదితరులు నటించారు.

రాఘవేంద్ర రావు సినిమా

చిట్టి తల్లి సినిమాకు దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం. ఈ మూవీకి శరణ్య తేజు కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. మధుకర్ మ్యూజిక్ డైరెక్టర్. రాఘవేంద్ర వర్మ ఎడిటర్.

కథా సుధ

ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కథా సుధ సిరీస్ లో భాగంగా ప్రతి ఆదివారం ఓ చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం చిట్టి తల్లి మూవీ అలాగే రిలీజ్ అయింది. ఈ సినిమా రన్ టైమ్ 35 నిమిషాలు మాత్రమే. త్వరగా అయిపోయే ఓటీటీ మూవీ చూడాలనుకునే వాళ్లకు చిట్టి తల్లి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

చిట్టి తల్లి కథ

అయితే గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు నేర్చుకుంటానని ఆ కూతురు సిటీకి వెళ్తుంది. ఆరు నెలలే కోర్స్ అని తండ్రిని ఒప్పిస్తుంది. కానీ సిటీకి వెళ్లిన తర్వాత అక్కడి పాష్ కల్చర్ కు అమ్మాయి అలవాటు పడుతుంది. అక్కడే ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది.

ఈ విషయం తెలుసుకున్న ఆ తండ్రి.. తన కూతురు అలా చేయదని నమ్మించాలనే ఉద్దేశంతో సిటీకి వెళ్తాడు. కానీ అక్కడ ఓ అబ్బాయితో తన కూతురిని చూసి షాక్ అవుతాడు. తన చిట్టి తల్లి మారిపోలేదని, చనిపోయిందని బాధపడుతుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ అమ్మాయి ఏం చేసింది? అనేది చిట్టి తల్లి సినిమాలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks