...
...
Next Story

Christopher Nolan Odyssey: క్రిస్టోఫర్ నోలన్ కు దారుణ అవమానం.. ఒడిస్సీ ట్రైలర్ డిస్‌లైకుల రికార్డు.. నెట్టింట ట్రోల్స్

Christopher Nolan Odyssey: ప్రపంచ సినిమా రంగంలో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న క్రిస్టోఫర్ నోలన్ ‘ఒడిస్సీ’కి షాక్ తగిలింది. ఆస్కార్ అవార్డు విన్నర్ నోలన్ కు దారుణమైన అవమానం ఎదురైంది. ఒడిస్సీ ట్రైలర్ నోలన్ కెరీర్ లోనే అత్యధిక డిస్‌లైకుల ట్రైలర్ గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.

Published on: Jul 4, 2026, 15:39:40 IST
Advertisement

Christopher Nolan Odyssey: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన లైనప్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఒడిస్సీ’ (Odyssey) జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజాగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ నెట్టింట తీవ్రమైన బ్యాక్‌లాష్ ఎదుర్కుంటోంది.

నోలన్ కు అవమానం

క్రిస్టోఫర్ నోలన్ కు దారుణ అవమానం.. ఒడిస్సీ ట్రైలర్ డిస్‌లైకుల రికార్డు (x)
క్రిస్టోఫర్ నోలన్ కు దారుణ అవమానం.. ఒడిస్సీ ట్రైలర్ డిస్‌లైకుల రికార్డు (x)

ఒడిస్సీ ట్రైలర్ కు వస్తున్న నెగెటివ్ రెస్పాన్స్ తో క్రిస్టోఫర్ నోలన్ కు దారుణమైన అవమానం కలిగింది. ఈ లెజండరీ డైరెక్టర్ కెరీర్ లోనే ఇది అత్యధిక డిస్‌లైకులు పొందిన ట్రైలర్ గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. జూలై 1న రిలీజైన ఒడిస్సీ ఫైనల్ ట్రైలర్ కు ఇప్పటివరకూ 53 వేలకు పైగా లైైక్స్ రాగా.. డిస్‌లైక్స్ మాత్రం ఏకంగా 3 లక్షలకు పైగా ఉన్నాయి. డిస్‌లైకుల శాతం ఏకంగా 85 శాతం ఉండటం గమనార్హం.

స్నో వైట్ తర్వాత

2025లో వచ్చిన డిస్నీమూవీ స్నోవైట్ తర్వాత అత్యధిక డిస్‌లైకులు పొందిన మూవీగా ఒడిస్సీ నిలిచిందని మూవీ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. స్నో వైట్ మూవీకి 90 శాతానికి పైగా డిస్‌లైకులు వచ్చాయి. ఇప్పుడు ఒడిస్సీ ట్రైలర్ కూడా అదే బాటలో సాగుతుంది. ఈ ట్రైలర్ కు తీవ్రమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

నోలన్ కెరీర్‌లోనే అత్యంత ఘోరమైన డిస్‌లైకుల రికార్డును ఈ ట్రైలర్ మూటగట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

అసలు కారణం ఏంటి?

గ్రీక్ పురాణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. నేటి ఆధునిక 'వోకిజం' (జాత్యహంకారం, లైంగిక వివక్ష, సామాజిక అసమానతల పట్ల అప్రమత్తంగా ఉండటం) భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కథలోని మూల పాత్రల ప్రాధాన్యతను పక్కనపెట్టి, కేవలం జాతి వైవిధ్యం చూపించాలనే తాపత్రయంతో మల్టీ రేషియల్ యాక్టర్లను ఎంపిక చేయడం చాలా ఆర్టిఫిషియల్‌గా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నోలన్‌కు బిగ్గెస్ట్ ఛాలెంజ్

విజువల్ వండర్స్‌ను, క్లిష్టమైన మైండ్-బెండింగ్ స్క్రీన్‌ప్లేను నమ్ముకునే క్రిస్టోఫర్ నోలన్.. ఈసారి కాస్టింగ్ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఆయనకు పెద్ద మైనస్‌గా మారేలా కనిపిస్తున్నాయి. జూలై 17న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ఈ నెగిటివిటీని దాటుకుని బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు రాణిస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఒకవేళ థియేటర్లలో కంటెంట్ చాలా అద్భుతంగా ఉండి, మౌత్ టాక్ పాజిటివ్‌గా వస్తే తప్ప, ఈ 'వోక్' వివాదం నుండి సినిమా గట్టెక్కడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe