The Odyssey: ఒక్క కట్ కూడా చెప్పలేదు.. సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్.. ఇండియాలో సెన్సార్ పూర్తి చేసుకున్న ది ఒడిస్సీ

The Odyssey: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తీసుకొస్తున్న మరో విజువల్ వండర్ ది ఒడిస్సీ ఒక్క కట్ కూడా లేకుండానే ఇండియాలో సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. జులై 17న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Published on: Jul 11, 2026, 10:12:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Odyssey: హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' ఇండియన్ సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి ఒక్క కట్ కూడా లేకుండా ప్యూర్ 'A' సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన గ్రాండ్ ఇండియా ప్రీమియర్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూస్ చూసి హాలీవుడ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. జులై 17న గ్లోబల్ లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 172 నిమిషాలుగా లాక్ అయింది.

The Odyssey: ఒక్క కట్ కూడా చెప్పలేదు.. సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్.. ఇండియాలో సెన్సార్ పూర్తి చేసుకున్న ది ఒడిస్సీ
The Odyssey: ఒక్క కట్ కూడా చెప్పలేదు.. సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్.. ఇండియాలో సెన్సార్ పూర్తి చేసుకున్న ది ఒడిస్సీ

సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్.. వరల్డ్ వైడ్ సేమ్ వెర్షన్

బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం.. సెన్సార్ బోర్డ్ సభ్యులు ది ఒడిస్సీ సినిమాలో ఒక్క డైలాగ్ కానీ, ఒక్క సీన్ కానీ మార్చకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కట్స్ లేకుండా ఏ వెర్షన్ రిలీజ్ అవుతుందో.. ఇండియన్ ఆడియన్స్ కూడా అదే ఒరిజినల్ కట్ థియేటర్లలో చూడబోతున్నారు.

జులై 9నే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ సెన్సార్ సర్టిఫికేట్ మేకర్స్ చేతికి వచ్చేసింది. హాలీవుడ్ స్టూడియోలు ఇండియా రిలీజ్ కోసం ఎలాంటి సెల్ఫ్ సెన్సార్‌షిప్ చేసుకోకపోవడం వల్లే ఇది సాధ్యమైంది.

అడల్ట్స్‌కు మాత్రమే..

అయితే ఈ సినిమాకు 'A' సర్టిఫికేట్ రావడంతో 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే థియేటర్లలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 172 నిమిషాల 33 సెకన్లు.. అంటే దాదాపు 2 గంటల 52 నిమిషాల పాటు ఆడియన్స్‌ను నోలన్ తన మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు.

గతంలో నోలన్ తీసిన 'ఓపెన్‌హైమర్' సినిమా ఇండియాలో ఏకంగా రూ.157.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ అన్ కట్ వెర్షన్ తో ఆ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ముంబై ప్రీమియర్ రచ్చ.. స్టేజ్ పై నోలన్ చిలిపి ప్రశ్నలు

ముంబైలో శుక్రవారం (జులై 10) జరిగిన ఇండియాలోనే ఫస్ట్ ఎవర్ ప్రీమియర్ ఈవెంట్‌లో క్రిస్టోఫర్ నోలన్ తో పాటు హాలీవుడ్ సూపర్ స్టార్స్ టామ్ హాలండ్, మ్యాట్ డామన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు స్టేజ్ పైకి వచ్చి ఇండియన్ ఆడియన్స్ తో లైవ్ లో ఇంటరాక్ట్ అయ్యారు. ముంబై ఫ్యాన్స్ చూపించిన క్రేజ్ చూసి హాలీవుడ్ స్టార్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది.

స్టేజ్ పై నోలన్ చాలా సరదాగా మాట్లాడుతూ.. "నేను ముంబైకి రావడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. కానీ ఇక్కడ నా సినిమాను లాంచ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ప్రపంచంలోనే ఈ సినిమాను చూసిన ఫస్ట్ ఆడియన్స్ మీరే" అని అనడంతో థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది.

ఆ వెంటనే టామ్ హాలండ్, మ్యాట్ డామన్‌లను పక్కన పెట్టుకుని.. "ఇంతకీ మీ అందరికీ సినిమా నచ్చిందా? వీరిద్దరిలో ఎవరు బాగా యాక్ట్ చేశారు? మ్యాట్ ఆ.. టామ్ ఆ..?" అంటూ నోలన్ చిలిపిగా అడిగిన ప్రశ్నకు ఇద్దరు హీరోలు స్టేజ్ పైనే నవ్వేశారు.

ఇండియాపై నోలన్ లవ్..

ఇండియాపై తనకున్న ప్రేమాభిమానాలను నోలన్ మరోసారి బయటపెట్టాడు. గతంలో తాను జోధ్‌పూర్ లో ఒకసారి, ముంబైలో ఒకసారి షూటింగ్స్ చేశానని, ఇండియన్ ఆడియన్స్ లాంటి సినిమా నాలెడ్జ్, ఉత్సాహం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ప్రశంసల వర్షం కురిపించాడు. నోలన్ గతంలో 'ది డార్క్ నైట్ రైజెస్' కోసం జోధ్‌పూర్ లోని మెహ్రాన్‌గఢ్ కోటలో, 'టెనెట్' సినిమా కోసం ముంబై పరిసరాల్లో షూట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

గ్రీక్ ఇతిహాసంతో వస్తున్న మ్యాజిక్

హోమర్ రాసిన వరల్డ్ ఫేమస్ గ్రీక్ ఇతిహాసం ఆధారంగా 'ది ఒడిస్సీ' తెరకెక్కింది. ట్రోజన్ వార్ ముగిసిన తర్వాత ఇతికా రాజు ఒడిస్సియస్ (మ్యాట్ డామన్) తన సొంత గూటికి చేరుకునే క్రమంలో ఎదుర్కొనే వింత జీవులు, రాక్షసులు, దేవుళ్లతో చేసే పోరాటమే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

ఈ సినిమాలో జెండయా, అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపితా న్యాంగో, ఛార్లీజ్ థెరాన్ లాంటి దిగ్గజ తారాగణం నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పూర్తి ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేసిన ఈ సినిమా జులై 17న వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ సునామీ సృష్టించడానికి రెడీ అవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More