The Odyssey Collections: నోలన్ హా మజాకా! ది ఒడిస్సీకి మూడు రోజుల్లోనే రూ.2500 కోట్ల కలెక్షన్లు.. ఆల్ టైమ్ రికార్డు!

The Odyssey Collections: హాలీవుడ్ విజనరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రేంజ్ ఇది. అతను తెరకెక్కించిన మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'ది ఒడిస్సీ' ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.2500 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది.

Published on: Jul 20, 2026, 10:20:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Odyssey Collections: హాలీవుడ్ మాస్టర్ మైండ్ క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద హడావుడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు కావ్యం ఆధారంగా $250 మిలియన్ల (సుమారు 2,080 కోట్లు) భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' ప్రస్తుతం గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

నోలన్ హా మజాకా! ది ఒడిస్సీకి మూడు రోజుల్లోనే రూ.2500 కోట్ల కలెక్షన్లు.. ఆల్ టైమ్ రికార్డు! (HT_PRINT)
నోలన్ హా మజాకా! ది ఒడిస్సీకి మూడు రోజుల్లోనే రూ.2500 కోట్ల కలెక్షన్లు.. ఆల్ టైమ్ రికార్డు! (HT_PRINT)

ది ఒడిస్సీ కలెక్షన్లు

క్రిస్టోఫర్ నోలన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ది ఒడిస్సీ’ రికార్డులు బ్రేక్ చేస్తోంది. కలెక్ష్లన్ల మోత మోగిస్తోంది. ఎలాంటి సూపర్ హీరో ఫ్రాంచైజీ లేదా సీక్వెల్ సపోర్ట్ లేకుండా, ఒక ఒరిజినల్ పీరియాడిక్ కథతో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం హాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

రూ.2546 కోట్లు

యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. 'ది ఒడిస్సీ' విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా $264.1 మిలియన్లు కొల్లగొట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఇది రూ.2546 కోట్లతో సమానం. ఇందులో ఒక్క ఉత్తర అమెరికా (యూఎస్, కెనడా) మార్కెట్ నుంచే $124.5 మిలియన్లు వసూలయ్యాయి.

డార్క్ నైట్‌ను దాటేసి

గతంలో 2012లో వచ్చిన నోలన్ ఐకానిక్ చిత్రం 'ది డార్క్ నైట్ రైజెస్' ($249 మిలియన్లు) సాధించిన ఆల్-టైమ్ ఓపెనింగ్ రికార్డును ‘ది ఒడిస్సీ’ బ్రేక్ చేసింది. నార్త్ అమెరికా గ్రాస్‌లో మాత్రం డార్క్ నైట్ ఫ్రాంచైజీ తర్వాత మూడో స్థానంలో ఒడిస్సీ నిలిచింది. అయితే అంతర్జాతీయ ఓవర్సీస్ మార్కెట్‌ను కలుపుకొంటే నోలన్ కెరీర్‌లోనే అత్యుత్తమ గ్లోబల్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ‘ది ఒడిస్సీ’ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

నోలన్ టాప్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్

  • ది ఒడిస్సీ (The Odyssey): $264.1 మిలియన్ల గ్లోబల్ ఓపెనింగ్‌తో నోలన్ కెరీర్ బిగ్గెస్ట్‌గా నిలిచింది. లాంగ్‌రన్‌లో $1 బిలియన్ దాటే దిశగా సాగుతోంది.
  • ది డార్క్ నైట్ రైజెస్ (The Dark Knight Rises): $249 మిలియన్ల ఓపెనింగ్‌తో లైఫ్‌టైమ్‌లో $1.08 బిలియన్లు రాబట్టింది.
  • ఒపెన్‌హైమర్ (Oppenheimer): 2023లో $180 మిలియన్లతో ప్రారంభమై చివరకు $915 మిలియన్ల భారీ వసూళ్లను సాధించింది.

ఒడిసియస్ ప్రయాణం

ట్రోజన్ వార్ ముగిసిన తర్వాత గ్రీక్ వీరుడు ఒడిసియస్ (మ్యాట్ డామన్) తన మాతృభూమికి చేరుకోవడానికి చేసే ప్రాణాంతక ప్రయాణమే ది ఒడిస్సీ సినిమా కథాంశం. ఈ సినిమాలో టామ్ హాలెండ్, జెండయా, ఆన్ హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్, లుపిటా న్యోంగో వంటి దిగ్గజ తారలు నటించడంతో సినిమాపై విపరీతమైన హైప్ ఏర్పడింది.

ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోసం వీక్షకులు క్యూ కట్టడంతో, యూఎస్ అండ్ కెనడాలో 50 శాతం మంది ఆడియన్స్ ప్రీమియం ఫార్మాట్లలోనే సినిమాను తిలకించారు. ఇందులో ఒక్క ఐమాక్స్ (IMAX) స్క్రీన్ల నుంచే 23 శాతం షేర్ రావడం విశేషం.

97 శాతం

ఏడాది క్రితమే ది ఒడిస్సీ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఐమాక్స్ చరిత్రలోనే ఆల్-టైమ్ రికార్డుగా $50 మిలియన్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. విపరీతమైన డిమాండ్ కారణంగా నార్త్ అమెరికా వ్యాప్తంగా 50కి పైగా ఐమాక్స్ థియేటర్లలో అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రత్యేక షోలు ప్రదర్శించారు. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సినిమాస్కోర్‌లో 'A' గ్రేడ్ లభించగా, ప్రముఖ రివ్యూ సైట్ రొటెన్ టొమాటోస్‌లో 97% పాజిటివ్ ఆడియన్స్ స్కోర్ దక్కింది.

1 బిలియన్ డాలర్ల దిశగా

క్రిస్టోఫర్ నోలన్ బ్రాండ్ వ్యాల్యూ ఏమిటో ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ ప్రదర్శన నిరూపిస్తోంది. 2023లో వచ్చిన 'ఒపెన్‌హైమర్' $915 మిలియన్ల వద్ద ఆగిపోగా, 'ది ఒడిస్సీ'కి లభించిన పాజిటివ్ టాక్, భారీ ఐమాక్స్ డిమాండ్ చూస్తుంటే నోలన్ ఖాతాలో మూడో $1 Billion ($100 కోట్లు) క్లబ్ మూవీ చేరడం నూటికి నూరు శాతం ఖాయంగా కనిపిస్తోంది. పీరియాడిక్ డ్రామాను ఐమాక్స్ కెమెరాలతో విజువల్ వండర్‌గా మలచడంలో నోలన్ విజన్ హాలీవుడ్ థియేట్రికల్ బిజినెస్‌కు సరికొత్త ఊపిరి పోసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More