...
...
Next Story

Nani: టైమ్ బాసూ టైమ్..క్లాప్ బాయ్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ వరకు..నితిన్-నాని ఫొటోలు వైరల్.. నాని సక్సెస్ చెప్పే 5 పాఠాలు

Nani Success Lessons: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, తన పేరునే ఓ బ్రాండ్ గా సెట్ చేశాడు హీరో నాని. ఒకప్పుడు నితిన్ సినిమాకు క్లాప్ బాయ్ గా పని చేసిన నాని.. ఇప్పుడు నితిన్ తో సినిమానే నిర్మిస్తున్నాడు. స్టార్ హీరోగా, ప్రొడ్యూసర్ గా ఎదిగిన నాని నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన 5 జీవిత పాఠాలు.

Published on: Aug 4, 2026, 10:45:41 IST
Advertisement

Nani Success Lessons: సినీ పరిశ్రమలో విజయం ఎవరికీ ఊరికే రాదు. గాడ్‌ఫాదర్ల మద్దతు లేకుండా, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి.. స్వయంకృషితో టాలీవుడ్‌లో ‘నేచురల్ స్టార్’గా ఎదిగిన నాని (Nani) సినీ ప్రయాణం ఒక అద్భుతమైన స్ఫూర్తి కథనం.

నితిన్ తో సినిమా

టైమ్ బాసూ టైమ్..క్లాప్ బాయ్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ వరకు..నితిన్-నాని ఫొటోలు వైరల్.. నాని సక్సెస్ చెప్పే 5 పాఠాలు
టైమ్ బాసూ టైమ్..క్లాప్ బాయ్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ వరకు..నితిన్-నాని ఫొటోలు వైరల్.. నాని సక్సెస్ చెప్పే 5 పాఠాలు

తాజాగా నితిన్ హీరోగా మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అలియాస్ రుక్మిణీ’ (Alias Rukmini) చిత్రం హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది. నాని సమర్పణలో యూనానిమస్ ప్రొడక్షన్స్ (Unanimous Productions) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అప్పుడు క్లాప్ బాయ్

ఇందులో అత్యంత విశేషమైన అంశం ఏంటంటే.. సరిగ్గా 21 ఏళ్ల క్రితం (2005లో) కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రానికి నాని క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. కాలం చక్రంలా తిరిగి, నేడు అదే నితిన్ చిత్రానికి నాని క్లాప్ కొట్టి, నిర్మాతగా నిలవడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఏలాంటి అంచనాలు లేకుండా వచ్చి, నేడు పాన్-ఇండియా రేంజ్‌లో తన మార్కెట్ వాల్యూను పెంచుకుంటున్న నాని సక్సెస్ ప్రయాణం నుంచి ప్రతిఒక్కరూ నేర్చుకోవాల్సిన 5 కీలకమైన లైఫ్ లెసన్స్ ఇవే.

1. పని చిన్నదైనా నైపుణ్యాన్ని పెంచుకోవడం

నాని తన కెరీర్‌ను నేరుగా హీరోగా ప్రారంభించలేదు. ఆర్జేగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, క్లాప్ బాయ్‌గా సెట్స్‌పై క్రమశిక్షణతో పనిచేశాడు. పని చిన్నదా పెద్దదా అని చూడకుండా, సినిమా నిర్మాణానికి సంబంధించి ప్రతి విభాగంపై అవగాహన పెంచుకున్నారు.

  • పాఠం: మీరు ఏ రంగంలో ఉన్నా.. ఆరంభంలో లభించే అవకాశం చిన్నదైనా సరే, నిరాశపడకుండా ఆ పనిని పర్పెక్ట్ గా నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఆ నైపుణ్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

2. సున్నా బ్యాక్‌గ్రౌండ్‌ను బలంగా మార్చుకోవడం

‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’ వంటి లైట్-హార్టెడ్ రొమాంటిక్ కామెడీలతో గుర్తింపు తెచ్చుకున్న నాని అక్కడితో ఆగిపోలేదు. ‘ఈగ’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’ నుంచి ఇటీవలి సినిమాల వరకు ప్రతి సినిమాలో తన పాత్రను మార్చుకుంటూ, నటుడిగా తన పరిధిని విస్తరించుకున్నాడు.

  • పాఠం: ఒకసారి విజయం సాధించిన తర్వాత ఆ కంఫర్ట్ జోన్‌లోనే ఉండిపోకూడదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ, మిమ్మల్ని మీరు రీ-ఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి.

4. వినయం వీడకపోవడం

21 ఏళ్ల క్రితం నితిన్ సెట్స్‌పై క్లాప్ కొట్టిన సహాయ దర్శకుడిగా ఉన్న నాని, నేడు అదే నితిన్ చిత్రానికి నిర్మాతగా మారిన సమయంలో ఎక్కడా అహంకారం ప్రదర్శించలేదు. ఎంతో వినయంతో, గౌరవంతో ఆ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేశాడు.

  • పాఠం: ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం సక్సెస్‌ను సుస్థిరం చేస్తుంది. మీరు దాటి వచ్చిన దారిని, పడిన కష్టాన్ని గుర్తుంచుకున్నప్పుడే సమాజంలో నిజమైన గౌరవం లభిస్తుంది.

5. ఇతరులను ప్రోత్సహించడం

హీరోగా తానొక్కడే సంపాదించుకోవడం కాకుండా, ‘వాల్ పోస్టర్ సినిమా’, ‘యూనానిమస్ ప్రొడక్షన్స్’ ద్వారా కొత్త దర్శకులను, వినూత్న కథలను నాని ప్రోత్సహిస్తున్నాడు. ‘అ!’, ‘హిట్’, ‘కోర్ట్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి, పరిశ్రమలో సరికొత్త లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను చూపించాడు.

  • పాఠం: నిజమైన నాయకుడు లేదా విజేత అంటే తాను మాత్రమే ఎదగడం కాదు.. తనతో పాటు ఇతరులకు అవకాశాలు కల్పిస్తూ, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks