Cockroach Janata Party: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సరికొత్త సంచలనంగా మారిన పొలిటికల్ సెటైర్ మూవ్‌మెంట్ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP). అయితే ఈ ఖాతాపై లీగల్ డిమాండ్ రావడంతో ఇండియాలో దీనిని 'విత్‌హెల్డ్' (నిలిపివేత) చేసినట్లు ఎక్స్ సంస్థ ప్రకటించింది.

ఈ విషయాన్ని సదరు మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన వ్యక్తిగత ఖాతా ద్వారా స్క్రీన్‌షాట్‌తో సహా పంచుకున్నారు. "మేము ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఇండియాలో బ్లాక్ చేశారు" అని ఆయన పేర్కొన్నారు.
సెలబ్రిటీల రియాక్షన్.. 'స్ట్రైసాండ్ ఎఫెక్ట్' అన్న వీర్ దాస్
ఈ అకౌంట్ బ్లాక్ కావడంపై పలువురు ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రీపోస్ట్‌లు చేశారు. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద దీనిపై స్పందిస్తూ.. "ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఎందుకు నిలిపివేశారు?" అని ప్రశ్నిస్తూ ఆమె ఆ పోస్ట్‌ను షేర్ చేశారు.
ఇక స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ తనదైన స్టైల్ కామెడీతో స్పందిస్తూ.. "ఇది పూర్తిగా స్ట్రైసాండ్ ఎఫెక్ట్ (Streisand Effect) లాంటిది" అని రాసుకొచ్చారు. ఒక సమాచారాన్ని లేదా విషయాన్ని దాచడానికి లేదా సెన్సార్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అది మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి వైరల్ అవ్వడాన్ని సైకాలజీలో 'స్ట్రైసాండ్ ఎఫెక్ట్' అంటారు.
ప్రకాష్ రాజ్, సనమ్ శెట్టి మద్దతు
మరోవైపు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ యూత్ మూవ్‌మెంట్‌కు తన మద్దతు పలికారు. "నమ్మకం ఉంది.. ఇది కచ్చితంగా జరుగుతుంది. నా దేశ యువత మేల్కొంటుంది.. ఎదురు తిరుగుతుంది. తమ హక్కులను తిరిగి పొందుతుంది. మీ అందరికీ మరిన్ని శక్తులు రావాలి" అంటూ తన ప్రసిద్ధ హ్యాష్‌ట్యాగ్ #justasking తో రీపోస్ట్ చేశారు.
అలాగే CJP కొత్తగా తెరిచిన బ్యాకప్ అకౌంట్ పోస్ట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. ఆ కొత్త అకౌంట్లో "మమ్మల్ని వదిలించుకోవచ్చని అనుకున్నారా? Lol" అని రాసి ఉంది.
{{/usCountry}}అలాగే CJP కొత్తగా తెరిచిన బ్యాకప్ అకౌంట్ పోస్ట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. ఆ కొత్త అకౌంట్లో "మమ్మల్ని వదిలించుకోవచ్చని అనుకున్నారా? Lol" అని రాసి ఉంది.
{{/usCountry}}నటి సనమ్ శెట్టి కూడా ఈ వినూత్న ఉద్యమాన్ని ప్రశంసించారు. "కేవలం ఒక్క వారంలోనే #CockroachJantaParty దేశవ్యాప్తంగా ఒక భారీ పవర్ సెంటర్‌గా మారింది. ఇది చాలా కొత్తగా, ఆశాజనకంగా ఉంది. ఇది ఏ దిశగా వెళ్తుందో చూడాలని ఆసక్తిగా ఉంది. యువత గొంతుకకు ఆల్ ది బెస్ట్" అని ఆమె పేర్కొన్నారు.
అసలు ఏమిటీ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)?
ఈ ఉద్యమం మే 16న 30 ఏళ్ల పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే ప్రారంభించారు. ఇటీవల ఒక కోర్టు విచారణ సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ పార్టీ పుట్టుకొచ్చింది.
ఆయన మాట్లాడుతూ.. "కొంతమంది యువకులు బొద్దింకల లాంటివారు. వారికి ఎలాంటి ఉపాధి లేదా ఉద్యోగం ఉండదు. అలాంటి వారిలో కొందరు మీడియాగా, మరికొందరు సోషల్ మీడియాగా, ఆర్‌టీఐ (RTI) యాక్టివిస్టులుగా మారి అందరిపై దాడులు చేయడం (విమర్శించడం) ప్రారంభిస్తారు" అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై నిరసనగా యువత తమ అసంతృప్తిని శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయడానికి ఈ జెన్-జీ (GenZ) సెటైరికల్ మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ఇది రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ, వీరు 5-పాయింట్ల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.
లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 16.3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషం. అయితే తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీని కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫౌండర్ అభిజీత్ ఆరోపించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అంటే ఏమిటి?
ఇది దేశంలోని యువత, సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల వచ్చిన ఒక వ్యాఖ్యకు నిరసనగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఒక వ్యంగ్యాత్మక, శాంతియుత నిరసన రాజకీయ ఉద్యమం.
2. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ప్రారంభం కావడానికి కారణం ఏమిటి?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ కోర్టు విచారణలో కొంతమంది నిరుద్యోగ యువత/యాక్టివిస్టులను 'బొద్దింకల'తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ నిరసన ఉద్యమం పుట్టింది.
3. ఈ పార్టీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు?
ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ వినూత్న ఉద్యమానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 16.3 మిలియన్ల మంది ఫాలోవర్లు లభించారు.
4. దీనిపై సెలబ్రిటీలు ఎలా స్పందించారు?
నటుడు ప్రకాష్ రాజ్, సనమ్ శెట్టి ఈ యూత్ మూవ్‌మెంట్‌కు మద్దతు ఇవ్వగా, చిన్మయి, వీర్ దాస్ ఈ అకౌంట్‌ను ఇండియాలో బ్లాక్ చేయడంపై విమర్శలు గుప్పించారు.