Rashmika Mandanna: బాలీవుడ్ సెన్సేషన్ కృతి సనన్ ఇప్పుడు తన తదుపరి చిత్రం 'కాక్ టెయిల్ 2' (Cocktail 2) ప్రమోషన్లలో బిజీగా ఉంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి ఆమె నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన 'ఫెమినా బ్యూటీ అవార్డ్స్' వేదికగా కృతి తన కో-స్టార్ రష్మిక గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేషనల్ క్రష్ రష్మికతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవమని కృతి కొనియాడారు.
"రష్మికలో ఆ నెగటివిటీ లేదు": కృతి సనన్

మొదటిసారి రష్మిక మందన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న కృతి సనన్, సెట్స్‌లో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
"రష్మిక చాలా నిజాయతీ కలిగిన వ్యక్తి. తను చాలా ప్రేమగా, ఆత్మీయంగా ఉంటుంది. ముఖ్యంగా తనలో ఎలాంటి అసూయ ఉండదు. కేవలం మంచితనం మాత్రమే కనిపిస్తుంది. నేను వైబ్స్ ని నమ్ముతాను, తన చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. తనతో కలిసి షూటింగ్‌లో పాల్గొనడం చాలా సరదాగా గడిచింది" అని కృతి పేర్కొన్నారు.
సీక్వెల్ కాదు.. ఒక కొత్త ఫ్రాంచైజీ
2012లో వచ్చిన సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటీల 'కాక్ టెయిల్' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న 'కాక్ టెయిల్ 2' దాని కథకు కొనసాగింపు కాదని కృతి స్పష్టం చేశారు.
"ఖచ్చితంగా పోలికలు వస్తాయని నాకు తెలుసు. కానీ ఇది సీక్వెల్ కాదు.. ఒక ఫ్రాంచైజీ సినిమా మాత్రమే. ఇందులోని పాత్రలు, కథ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇది నేటి తరం రిలేషన్ షిప్స్ కు అద్దం పడుతుంది" అని ఆమె వివరించారు.
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ప్రస్తావన
రష్మిక వ్యక్తిగత జీవితం గురించి కూడా కృతి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్మిక, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు.
{{/usCountry}}రష్మిక వ్యక్తిగత జీవితం గురించి కూడా కృతి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్మిక, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు.
{{/usCountry}}ఈ వేడుకకు హాజరైన కృతి.. ఆ జంటకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడు హోమి అడజానియా కూడా అప్పట్లో ఇన్ స్టా స్టోరీస్ లో సరదాగా కృతిని ఆటపట్టించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందుతున్న 'కాక్ టెయిల్ 2' జూన్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలోని 'జబ్ తలక్' అనే మొదటి పాట ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. షాహిద్ కపూర్ తో కృతికి ఇది రెండో సినిమా కాగా, రష్మికకు ఇది ఐదో బాలీవుడ్ చిత్రం కావడం విశేషం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'కాక్ టెయిల్ 2' విడుదల తేదీ ఎప్పుడు?
ఈ చిత్రం జూన్ 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
2. కాక్ టెయిల్ 2 సినిమాలో ప్రధాన తారాగణం ఎవరు?
షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హోమి అడజానియా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
3. ఇది మొదటి 'కాక్ టెయిల్' సినిమాకు సీక్వెలా?
కాదు.. ఇది కేవలం ఒక 'స్పిరిచువల్ సీక్వెల్' లేదా ఫ్రాంచైజీ చిత్రం. మొదటి సినిమాలోని పాత్రలకు, దీనికి ఎటువంటి సంబంధం ఉండదు.
4. రష్మిక మందన్న వివాహం ఎప్పుడు జరిగింది?
రష్మిక మందన్న ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లో నటుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్నారు.