బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిపోయిన కృతి సనన్- లండన్ వీధుల్లో చెట్టాపట్టాల్- పక్కన మరో హీరో! వైరల్ అవుతున్న వీడియో

బాలీవుడ్, టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ తన ప్రియుడు కబీర్ బహియాతో కలిసి లండన్ వీధుల్లో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతూ కెమెరా కంటికి చిక్కారు. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు ఈ వీడియో బలాన్ని చేకూరుస్తోంది. అయితే, వీరిద్దరితో మరో హీరో కూడా ఉండటం విశేషంగా మారింది.

Published on: Feb 23, 2026, 10:30:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ వ్యక్తిగత జీవితం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో కృతి సనన్ ప్రేమలో ఉందంటూ వస్తున్న రూమర్లు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ లండన్ వీధుల్లో చేతులు పట్టుకుని నడుస్తున్న ఒక వీడియో రెడ్డిట్ (Reddit) వేదికగా బయటకు వచ్చి వైరల్ అవుతోంది.

బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిపోయిన కృతి సనన్- లండన్ వీధుల్లో చెట్టాపట్టాల్- పక్కన మరో హీరో! వైరల్ అవుతున్న వీడియో
బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిపోయిన కృతి సనన్- లండన్ వీధుల్లో చెట్టాపట్టాల్- పక్కన మరో హీరో! వైరల్ అవుతున్న వీడియో

లండన్ వీధుల్లో లవ్ బర్డ్స్

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కృతి సనన్ బ్రౌన్ కలర్ స్వెటర్, బ్లూ డెనిమ్స్ ధరించి స్టైలిష్‌గా కనిపించగా.. కబీర్ బహియా వైట్ టీ-షర్ట్, బ్లూ హూడీలో సింపుల్‌గా ఉన్నారు. కృతి సనన్, కబీర్ బహియా వీరిద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఎంతో సన్నిహితంగా నడుస్తూ కనిపించారు. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, కృతి సనన్ అభిమానులు మాత్రం ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హీరో వరుణ్ ధావన్ కూడా

కబీర్, కృతి సనన్ కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబరులో అబుదాబిలో జరిగిన యూఎఫ్సీ 321 మ్యాచ్‌లో కృతి, కబీర్ పాల్గొన్నారు. వారితోపాటు పక్కనే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా ఉన్నాడు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో కృతి సనన్ షేర్ చేసింది. అదే ఏడాది జూలైలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ కోసం లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో కనిపించింది ఈ జంట.

ఎవరీ కబీర్ బహియా?

ఇకపోతే కబీర్ బహియా లండన్‌లోని ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి కుల్జిందర్ బహియా, యూకేలోని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ 'సౌతాల్ ట్రావెల్' వ్యవస్థాపకుడు. 1999లో జన్మించిన కబీర్, ఇంగ్లాండ్‌లోని మిల్‌ఫీల్డ్ బోర్డింగ్ స్కూల్‌లో విద్యనభ్యసించారు.

సోదరి ద్వారానే పరిచయం

కృతి సోదరి నుపుర్ సనన్ ద్వారానే వీరిద్దరికీ పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో అబుదాబిలో జరిగిన యూఎఫ్ సీ (UFC) మ్యాచ్‌లోనూ, అలాగే లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లోనూ వీరిద్దరూ కలిసి కనిపించారు. దుబాయ్‌లో జరిగిన ఒక ఫ్యామిలీ వెడ్డింగ్‌తో పాటు ఉస్తాద్ రాహత్ ఫతే అలీ ఖాన్ కచేరీకి కూడా ఈ జంట హాజరైంది.

సినిమా విశేషాలు

కాగా కెరీర్ పరంగా చూస్తే, కృతి సనన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ధనుష్ సరసన 'తేరే ఇష్క్ మే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి సనన్ హోమీ అదాజానియా దర్శకత్వంలో రూపొందే మూవీలో నటిస్తున్నట్లు సమాచారం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More