...
...
Next Story

Collar Ey Etthara Full Song: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కాలరే ఎత్తరా ఫుల్ సాంగ్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు..

Collar Ey Etthara Full Song: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కాలరే ఎత్తరా అంటూ థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది. గురువారం (మార్చి 12) సాయంత్రం మైత్రీ విమల్ థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్లో ఈ సాంగ్ రిలీజ్ చేశారు.

Published on: Mar 12, 2026, 17:09:00 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి థర్డ్ సింగిల్ కూడా వచ్చేసింది. పవన్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా, కాలర్ ఎత్తుకొని తిరిగేలా కాలరే ఎత్తరా అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ గా మారిపోయింది.

దేవిశ్రీ మ్యాజిక్.. రామ్ మిరియాల వాయిస్

Collar Ey Etthara Full Song: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కాలరే ఎత్తరా ఫుల్ సాంగ్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు..
Collar Ey Etthara Full Song: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కాలరే ఎత్తరా ఫుల్ సాంగ్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు..

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని ఈ కాలరే ఎత్తరా పాటకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. కాసర్ల శ్యామ్ పాట రాయగా.. రామ్ మిరియాల పాడాడు. ఈ పాటలో పవన్ వేసిన స్టెప్స్ హైలైట్ గా నిలిచాయి. ఎక్కే దిగే కిక్కులోన దక్కేదేముందే.. అరే సచ్చే దాకా కిక్కే ఉండాలి అంటూ సాగిపోయిందీ పాట.

కొన్ని వందల మంది మీద పాటను చిత్రీకరించడం చూడొచ్చు. పాట మధ్యలో హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్, రామ్ మిరియాల ఊపు మీద ఉన్న విజువల్స్ ను కూడా ఇందులో చేర్చారు. ఇక మూవీలోని ఫిమేల్స్ లీడ్స్ లో ఒకరిగా ఉన్న రాశీ ఖన్నా కూడా ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విశేషాలు

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఆర్. పార్తిబన్, అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, అవినాష్ లాంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ దశరథ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. శ్రీలీల ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks