...
...
Next Story

Jetlee Satya: వెన్నెల కిశోర్ నాకు వార్నింగ్ ఇచ్చాడు..హీరోయిన్‌కు అవి నేర్పించా..క‌మెడియ‌న్ స‌త్య స్పీచ్‌..వీడియో వైర‌ల్

Jetlee Satya: తెలుగు ఆడియన్స్ కు కామెడీలో కాత్త ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ‘జెట్లీ’ మూవీ రాబోతుంది. కమెడియన్లు సత్య, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఫన్నీగా ఉంది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో సత్య కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: Apr 23, 2026, 05:55:13 IST
Advertisement

Jetlee Satya: ఓ వైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు కామెడీ మూవీస్ లో హీరోగానూ సత్య అదరగొడుతున్నాడు. తాజాగా అతను లీడ్ రోల్ ప్లే చేస్తున్న మూవీ ‘జెట్లీ’ ట్రైలర్ రిలీజ్ అయింది. సత్యతో పాటు వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో సత్య స్పీచ్ వైరల్ గా మారింది.

సత్య కామెంట్లు

సత్య (youtube)
సత్య (youtube)

తెలుగు కామెడీ ఎంటర్ టైనర్ ‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కూడా చాలా సరదగా జరిగింది. తమ కామెడీ మూవీని ప్రమోట్ చేసేలా నటీ నటులందరూ ఫన్నీగా కనిపించారు. ఈ లాంఛ్ ఈవెంట్లో సత్య మరోసారి తన కామెడీ మార్క్ తో అందరినీ నవ్వించాడు.

హీరోయిన్ కు ఏం నేర్పించానంటే?

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో వెన్నెల కిశోర్ మాట్లాడుతుండగా మైక్ తీసుకుని సత్య మాట్లాడాడు. డైరెక్టర్ రితేష్ రాణా ఇచ్చిన పేపర్ పై ఉన్న స్పీచ్ ను సత్య చదివేశాడు. ‘‘ఈ సినిమాలో హీరోయిన్ రియా సింఘాకు డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను. కానీ అది చేయకుండా అన్నంలో ఆవకాయ ఎలా కలుపుకోవాలి. పప్పులో వడియాలు ఎలా నంజుకోవాలి లాంటి విషయాలు నేర్పిస్తూ టైమ్ పాస్ చేశా’’ అని సత్య ఫన్నీగా చెప్పాడు.

వెన్నెల కిశోర్ వార్నింగ్

‘‘కో స్టార్స్ అయిన వెన్నెల కిశోర్, అజయ్, హర్ష చెముడు, గుండు సుదర్శన్ టైమ్ సెన్స్ లేని నా కోసం సెట్లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాళ భైరవ ఏమన్నాడంటే.. ఆల్రెడీ అక్కడ సత్య చితక్కొడుతున్నాడు కదా మళ్లీ నేను ఎందుకు కొట్టడం అని అన్నాడు’’ అని సత్య తెలిపాడు. మూవీ టీమ్ తన గురించి ఏమనుకుంటుందో సెటైరికల్ గా సత్య చెప్పాడు.

ఫుల్ కామెడీ

జెట్లీ ట్రైలర్ కడపుబ్బా నవ్వించేలా ఉంది. కమెడియన్ల బ్యాచ్ అంతా కలిసి చేసిన హంగామా మరో లెవల్ ఉందనే కామెంట్లు వస్తున్నాయి. గతం మర్చిపోయిన వ్యక్తిగా సత్య చేసే సందడి ఫుల్ ఫన్నీగా ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks