Comrade Kalyan Review:

సినిమా పేరు : కామ్రేడ్ కళ్యాణ్
నటీనటులు : శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు
డైరెక్టర్ : జానకిరామ్ మారెళ్ల
రిలీజ్ డేట్ : అక్టోబర్ 9 ,2026
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కిన సరికొత్త అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'కామ్రేడ్ కళ్యాణ్'. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌కు కామెడీని జోడించి రూపొందించిన ఈ సినిమా ఈరోజు (అక్టోబర్ 9, 2026) థియేటర్లలోకి వచ్చింది. శ్రీవిష్ణు నవ్వుల విప్లవం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కామ్రేడ్ కళ్యాణ్ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లోని 'మాడుగుల' అనే నక్సల్స్ ప్రభావం ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఈ కామ్రేడ్ కళ్యాణ్ మూవీ కథ జరుగుతుంది. అక్కడ కళ్యాణ్ (శ్రీవిష్ణు) తన స్నేహితుడు సుదర్శన్‌తో కలిసి 'అలంకార్' అనే పాత టూరింగ్ టాకీస్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తుంటాడు. ఆ ఊరిలో కమ్యూనిజం ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆర్.నారాయణమూర్తి సినిమాలు ఆడిస్తూ ఆ థియేటర్‌ను సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు.
అతని తల్లి సరస్వతమ్మ(రాధికా శరత్ కుమార్) బాలయ్య బాబు ఫ్యాన్. ఆమె చేసే అల్లరి పనుల వల్ల కళ్యాణ్ తరచూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలా ఒకసారి ఆమెను పోలీస్ స్టేషన్ నుండి తెచ్చే క్రమంలో ఒరియా అమ్మాయి సితార (మహిమా నంబియార్) పరిచయమవుతుంది. సరస్వతమ్మను ఆమె కాపాడుతుంది.
సితారతో కళ్యాణ్ ప్రేమలో పడతాడు. అయితే సితార కుటుంబం ఒక సేట్ (ఉపేంద్ర లిమాయే) దగ్గర భారీగా అప్పు చేసి ఊరు విడిచి వచ్చిందని, ఆ సేట్ ఆమెను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని తెలుస్తుంది. తన ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అప్పు తీరుస్తానని కళ్యాణ్ సవాల్ చేస్తాడు. ఆ డబ్బు సంపాదించే క్రమంలో అనుకోకుండా ఒక విచిత్రమైన స్కీమ్‌లో చేరి 'కామ్రేడ్ కళ్యాణ్' (నక్సలైట్) గా మారతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అతని ప్రేమ సఫలమైందా లేదా? అనేది మిగతా కథ.
విశ్లేషణ
{{/usCountry}}సితారతో కళ్యాణ్ ప్రేమలో పడతాడు. అయితే సితార కుటుంబం ఒక సేట్ (ఉపేంద్ర లిమాయే) దగ్గర భారీగా అప్పు చేసి ఊరు విడిచి వచ్చిందని, ఆ సేట్ ఆమెను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని తెలుస్తుంది. తన ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అప్పు తీరుస్తానని కళ్యాణ్ సవాల్ చేస్తాడు. ఆ డబ్బు సంపాదించే క్రమంలో అనుకోకుండా ఒక విచిత్రమైన స్కీమ్‌లో చేరి 'కామ్రేడ్ కళ్యాణ్' (నక్సలైట్) గా మారతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అతని ప్రేమ సఫలమైందా లేదా? అనేది మిగతా కథ.
విశ్లేషణ
{{/usCountry}}సాధారణంగా నక్సలిజం, అడవులు, ఎన్‌కౌంటర్లు అంటే సీరియస్ డ్రామా ఆశిస్తాం. కానీ దర్శకుడు జానకిరామ్ ఈ సీరియస్ నేపథ్యానికి కంప్లీట్ కామెడీ రంగు అద్దారు. సినిమా ప్రారంభం కాస్త సీరియస్‌గా ఉన్నా, వెంటనే శ్రీవిష్ణు మార్క్ వినోదంలోకి వెళ్లిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో శ్రీవిష్ణు, సత్య, సుదర్శన్ ల కామెడీ ట్రాక్ నాన్‌స్టాప్ నవ్వులను పూయిస్తుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ లవ్ లెటర్ సీన్, నక్సలైట్ల మధ్య హీరో ఇరుక్కున్నప్పుడు వచ్చే సీన్లు థియేటర్లలో నవ్వుల పంట పండిస్తాయి.
అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథలో లాజిక్కులు లోపించాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు, రొటీన్ మెసేజ్ అంతగా కనెక్ట్ అవ్వవు. ఏదో సినిమా ముగించాలి కాబట్టి అందరూ అర్జెంట్‌గా మారిపోయినట్లు చూపించడం కాస్త అసహజంగా అనిపిస్తుంది. అయినప్పటికీ, కథలో లాజిక్స్ వెతకకుండా కేవలం టైమ్‌పాస్ వినోదం కోసం చూసేవాళ్లు ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఎవరెలా చేశారంటే?
హీరో శ్రీవిష్ణు తన అలవాటైన టైమింగ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో సినిమాను వన్‌మెన్ షోగా ముందుండి నడిపించారు. కామ్రేడ్ కళ్యాణ్‌గా కామెడీ పండించడంలో ఆయన వంద శాతం సఫలమయ్యారు. దుబాయ్ బాబుగా నటించిన సత్య తన హావభావాలు, కామెడీ టైమింగ్‌తో కొన్ని సీన్లలో శ్రీవిష్ణును మించిపోయి నవ్వించారు.
హీరోయిన్ మహిమా నంబియార్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తెరపై అందంగా కనిపించారు. అయితే ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. తల్లి పాత్రలో రాధికా శరత్ కుమార్ ప్రారంభంలో నవ్వించినా, ఆ తర్వాత ఆమె పాత్ర ప్రాధాన్యత తగ్గింది. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన షైన్ టామ్ చాకో, అప్పు ఇచ్చిన సేట్‌గా ఉపేంద్ర లిమాయే రెగ్యులర్ పాత్రల్లో మెప్పించారు. సుదర్శన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పరిధి మేర నవ్వించారు.
టెక్నికల్ గా
సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయి శ్రీరామ్ కంటికి ఇంపుగా ఉండేలా అడవి, పల్లెటూరి విజువల్స్‌ను కెమెరాలో బంధించారు. విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్‌లో 'ఒరియా పిల్ల' సాంగ్, ఆర్.నారాయణమూర్తి శైలిని గుర్తుచేసే విప్లవ గీతం వినడానికి, తెరపై చూడడానికి ఉత్సాహాన్నిస్తాయి. ద్వితీయార్థంలో ఎడిటింగ్ కాస్త బెటర్ గా ఉండాల్సింది. సినిమాల్లో లేటెస్ట్ అంశాలు, పాప్ కల్చర్ పంచ్‌లు అక్కడక్కడా బాగా పేలాయి.
ఫైనల్ గా
ఓవరాల్‌గా 'కామ్రేడ్ కళ్యాణ్' అనేది లాజిక్‌లను పక్కనబెట్టి, కేవలం నవ్వుకోవడానికి చూసే ఒక పక్కా టైమ్‌పాస్ వీకెండ్ సినిమా. కథలో లోతులు, బలమైన భావోద్వేగాలు ఆశించకుండా.. శ్రీవిష్ణు, సత్య మార్క్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ వారం థియేటర్లలో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది.