OTT Releases: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలో ఒక్కో భాషలో ఒక్కో టాప్ మూవీ.. కామెడీ టూ హారర్.. డోంట్ మిస్
OTT Releases: వీకెండ్ వచ్చేసింది. ఓటీటీలో ఏం చూడాలో అర్థం కావడం లేదా? మరి ఇంకెందుకు లేటు.. ఈ వారం ఓటీటీలోని టాప్ న్యూ రిలీజ్ లపై ఓ లుక్కేయండి. ఇందులో ఒక్కో భాష నుంచి ఒక్కో మూవీ ఉంది. కామెడీ నుంచి హారర్ థ్రిల్లర్ జోనర్లున్నాయి.
OTT Releases: ఈ వారం ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కామెడీ నుంచి హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ దాకా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వీకెండ్ వచ్చేసరికి ఓటీటీ వేదికలు కొత్త సినిమాలతో కళకళలాడుతున్నాయి. పాన్-ఇండియా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా విభిన్న భాషల నుంచి వచ్చిన టాప్ రిలీజెస్ వివరాలు ఇవే.

హాయ్ – జీ5 (Zee5)
తమిళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ హాయ్ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అవుతోంది. ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ ఒరిజినల్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.
అగధ – జీ5
తెలుగులో తెరకెక్కిన హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లింగ్ డ్రామా 'అగధ'. దుష్ట శక్తికి, దైవ శక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. పాతళంలో ఉన్న అగధ మేల్కొంటే ఏం జరిగిందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ మూవీ జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
అభిరామి – మనోరమా మ్యాక్స్ (ManoramaMax)
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సరికొత్త చిత్రం 'అభిరామి'. మనోరమా మ్యాక్స్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దుబాయిలోని ఓ నర్సు చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది.
బేబీ డూ డై డూ – నెట్‌ఫ్లిక్స్ (Netflix)
బేబీ డూ డై డూ మూవీ డార్క్ కామెడీ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన హిందీ చిత్రం. ఇది పాపులర్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్ వాచ్‌గా అందుబాటులోకి వచ్చింది. చెవిటి, మూగ అయిన ఓ లేడీ కాంట్రాక్ట్ కిల్లర్ స్టోరీ ఇది. ఇందులో హ్యూమా ఖురేషీ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ చిత్రంపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించడం విశేషం.
మ్యాంగో పచ్చ– జియోహాట్‌స్టార్ (JioHotstar)
కన్నడలో వచ్చిన హై వోల్టేజీ యాక్షన్ థ్రిల్లర్ ‘మ్యాంగోపచ్చ’. సస్పెన్స్ తో సాగే ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో విడుదలైంది. కన్నడ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను వీక్షించవచ్చు.
వీకెండ్ వాచ్‌లిస్ట్
ఈ వారం ఓటీటీ రిలీజ్ లు కామెడీ, హారర్, మిస్టరీ, హ్యూమన్ డ్రామాలాంటి విభిన్న స్టోరీలు, జోనర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేశాయి. అంతేకాకుండా దాదాపు అన్ని సినిమాలు డబ్బింగ్ ఆడియోలతో అందుబాటులో ఉండటం వల్ల ప్రాంతీయ సరిహద్దులు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వీకెండ్ తమకు నచ్చిన కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


