సస్పెన్స్ కు తెరపడనుంది. తెలుగు ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న పాపులర్ వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతుంది. తెలుగులో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సిరీస్ సీజన్ 2 ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేశారు. దీంతో ‘వేర్ ఈజ్ చంద్రిక?’ అనే ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది.
కానిస్టేబుల్ కనకం ఓటీటీ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఇదో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ గా ఇది డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్టు 14, 2025 నుంచి ఓటీటీలోకి అందుబాటులో వచ్చింది.
సీజన్ 2 డేట్
ఇప్పుడు కానిస్టేబుల్ కనకం సీజన్ 2 రాబోతుంది. ఈ సీజన్ 2 జనవరి 8, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇవాళ (డిసెంబర్ 28) ప్రకటించింది.
‘‘నిశ్శబ్దానికి ఎన్నో ప్రశ్నలు. సీజన్ 2లో అన్ని సమాధానాలు ఉంటాయి. అన్ని ప్రశ్నలు ఒకే నిజానికి దారి తీస్తాయి. చంద్రిక ఎక్కడ? ఈటీవీ విన్ లో జనవరి 8 నుంచి కానిస్టేబుల్ కనకం సీజన్ 2’’ అని ఈటీవీ విన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఉత్కంఠ రేపేలా
కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ను ఆద్యంత ఉత్కంఠ రేపేలా తెరకెక్కించారు. ఈ థ్రిల్లర్ సిరీస్ కు ప్రశాంత్ కుమార్ డైరెక్టర్. ఇందులో వర్ష బొల్లమ్మ లేడీ కానిస్టేబుల్ గా నటించింది. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల హెడ్ కానిస్టేబుల్ గా కీలక పాత్ర పోషించాడు. ఇంకా అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది.
కానిస్టేబుల్ కనకం స్టోరీ
కానిస్టేబుల్ కనకం సీజన్ 1లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ 1 ఆద్యంతం థ్రిల్, హారర్, మిస్టరీ అంశాలతో సాగుతుంది. 1998 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె గ్రామ సమీపంలో అడవిగుట్ట వైపు వెళ్లే అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. దీంతో పోలీసులు, ఆ ఊరి ప్రెసిడెంట్ (అవసరాల శ్రీనివాస్) అటు వైపు, ముఖ్యంగా రాత్రి పూట ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయిస్తారు.
అమ్మాయిల మిస్సింగ్
{{/usCountry}}కానిస్టేబుల్ కనకం సీజన్ 1లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ 1 ఆద్యంతం థ్రిల్, హారర్, మిస్టరీ అంశాలతో సాగుతుంది. 1998 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె గ్రామ సమీపంలో అడవిగుట్ట వైపు వెళ్లే అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. దీంతో పోలీసులు, ఆ ఊరి ప్రెసిడెంట్ (అవసరాల శ్రీనివాస్) అటు వైపు, ముఖ్యంగా రాత్రి పూట ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయిస్తారు.
అమ్మాయిల మిస్సింగ్
{{/usCountry}}అడవి గుట్ట వైపు వెళ్లిన ముగ్గురు మహిళలు కనిపించకుండా పోతుంటారు. అదే గ్రామానికి కనకం (వర్ష బొల్లమ్మ) కానిస్టేబుల్‌గా వస్తుంది. చంద్రిక (మేఘలేఖ)తో ఆమెకు మంచి స్నేహ బంధం ఉంటుంది. కానీ చంద్రిక మిస్ అవుతుంది. ఎవరి సహకారం లేకపోయినా కనకం ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మిస్ అయిన మిగతా అమ్మాయిలకు ఏమైందో తెలుస్తుంది. కానీ చంద్రిక ఆచూకీ దొరకదు.