మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం పెద్ది వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని కొన్ని సంభాషణలు గిరిజన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ట్రైబల్ రైట్స్ (విజయనగరం జిల్లా) అధ్యక్షుడు తుమ్మి అప్పల రాజు దొర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లా ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC)కు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. పెద్ది చిత్రంలో ఉపయోగించిన ‘కొండన కొడకా’ వంటి పదాలు గిరిజన ప్రజల ఆత్మగౌరవాన్ని, భావోద్వేగాలను తీవ్రంగా గాయపరిచేలా ఉన్నాయన్నారు. అందువల్ల ఆ పదాలను సినిమా నుండి తక్షణమే తొలగించేలా సెన్సార్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్‌ను ఆదివాసీ సంఘాల ప్రతినిధులు స్వయంగా కలిసి ఒక సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు.
'సమాజంలో ఇటువంటి అవమానకరమైన పదాల వాడకంపై చట్టపరమైన నిషేధం ఉంది. గిరిజనులను కించపరిచేలా మాట్లాడటం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (Prevention of Atrocities) చట్టం, 1989 ప్రకారం నేరం. ఇటువంటి డైలాగులు ఉంచితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.' అని అప్పలరాజు దొర ఈ సందర్భంగా హెచ్చరించారు.
సినిమాలు సమాజంపై, ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయని గిరిజన నాయకులు పేర్కొన్నారు. వినోదం పేరుతో వెనకబడిన వర్గాలను లేదా గిరిజన సంస్కృతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలను సహించేది లేదన్నారు. సెన్సార్ బోర్డు ఇటువంటి సున్నితమైన అంశాలను నిశితంగా పరిశీలించి, వివాదాస్పద సన్నివేశాలకు, డైలాగులకు కత్తెర వేయాలని కోరారు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూరల్ డ్రామా నేపథ్యంతో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన సంఘాల నుంచి వచ్చిన ఈ అభ్యంతరాలపై చిత్ర యూనిట్ లేదా దర్శకుడు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్ది మూవీ కలెక్షన్లలోనూ దూసుకెళ్తోంది. ఇప్పుడు ఏకంగా రూ. 400 కోట్లు క్రాస్ చేసింది.
{{/usCountry}}ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూరల్ డ్రామా నేపథ్యంతో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన సంఘాల నుంచి వచ్చిన ఈ అభ్యంతరాలపై చిత్ర యూనిట్ లేదా దర్శకుడు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్ది మూవీ కలెక్షన్లలోనూ దూసుకెళ్తోంది. ఇప్పుడు ఏకంగా రూ. 400 కోట్లు క్రాస్ చేసింది.
{{/usCountry}}