రికార్డులు నెలకొల్పడం, వాటిని తిరగరాయడం.. ఇదే పనిగా సాగుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో అత్యధిక ఓటీటీ రేట్ పలికిన సినిమాగా పుష్ఫ 2 ఉంది. ఆ సినిమా ఓటీటీ రేట్లకు ఏకంగా రూ.275 కోట్లు వచ్చాయి. ఇప్పుడా రికార్డును అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న మూవీ బ్రేక్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.
రూ.600 కోట్లు

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఏఏ22 x ఏ6 వర్కింట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఓ క్రేజీ బజ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ డీల్ ఏకంగా రూ.600 కోట్లకు కుదిరినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం రికార్డు రేటు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. అన్ని భాషల్లో కలిపి ఇంత మొత్తం చెల్లించనుందని టాక్.
ఆల్ టైమ్ రికార్డు
ఇప్పటివరకూ అత్యధిక ఓటీటీ రేట్ పలికిన సినిమాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ఉంది. దీని ఓటీటీ రేట్ రూ.275 కోట్లు. ఇప్పుడు ఆ మూవీ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న తర్వాతి సినిమానే రికార్డులు బ్రేక్ చేయబోతుంది. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయనుంది. ఇండియాలో ఏ సినిమా ఓటీటీ హక్కుల కోసమైనా రూ.600 కోట్లు అనేది ఇదే ఫస్ట్ టైమ్ కానుంది. అయితే ఈ ఓటీటీ డీల్ పై ఇంకా నెట్‌ఫ్లిక్స్ నుంచి కానీ, మేకర్స్ నుంచి కానీ అఫీషియల్ అప్ డేట్ రాలేదు.
కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్
అల్లు అర్జున్-అట్లీ మూవీ ఓటీటీ డీల్ రూ.600 కోట్లకు కుదిరిందనే బజ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. ఇదీ మా హీరో రేంజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అప్పుడు పుష్ప 2, ఇప్పుడు ఏఏ22 x ఏ6 అని తెగ ఖుష్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్స్ లో ఇదే ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
రూ.1000 కోట్ల బడ్జెట్
{{/usCountry}}అల్లు అర్జున్-అట్లీ మూవీ ఓటీటీ డీల్ రూ.600 కోట్లకు కుదిరిందనే బజ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. ఇదీ మా హీరో రేంజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అప్పుడు పుష్ప 2, ఇప్పుడు ఏఏ22 x ఏ6 అని తెగ ఖుష్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్స్ లో ఇదే ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
రూ.1000 కోట్ల బడ్జెట్
{{/usCountry}}అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ బడ్జెట్ రూ.1000 కోట్లు అని తెలిసింది. ఈ సినిమాలో దీపికా పదుకొణే, మృనాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. ఈ మూవీని 2027 సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2026 పూర్తయ్యే సరికి షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.