...
...
Next Story

OTT Crime Thriller: చెవిటి,మూగ లేడీ కాంట్రాక్ట్ కిల్లర్-మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్-ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్

OTT Crime Thriller: బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ నటించిన డిఫరెంట్ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'బేబీ డూ డై డూ'. థియేటర్లో అదరగొట్టిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. రామ్ చరణ్ మెచ్చిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Sep 22, 2026, 09:29:16 IST
Advertisement

OTT Crime Thriller: ఓటీటీలో ఎప్పటికప్పుడూ డిఫరెంట్ కంటెంట్ పలకరిస్తూనే ఉంటుంది. వేర్వేరు జోనర్లలో థ్రిల్లర్లు ఓటీటీ లవర్స్ కు అదిరిపోయే ఎక్స్ పీరియన్స్ అందిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిందే. అదే.. ‘బేడీ డూ డై డూ’ మూవీ. థియేటర్లలో బాగానే ఆడిన ఈ హిందీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

బేడీ డూ డై డూ ఓటీటీ రిలీజ్ డేట్

చెవిటి,మూగ లేడీ కాంట్రాక్ట్ కిల్లర్-మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్-ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్
చెవిటి,మూగ లేడీ కాంట్రాక్ట్ కిల్లర్-మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్-ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్

బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ లీడ్ రోల్ ప్లే చేసిన డార్క్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'బేబీ డూ డై డూ' (Baby Do Die Do) ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయింది. సెప్టెంబర్ 23, 2026న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నట్లు ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

నచికేత్ సమంత్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో హ్యూమా ఖురేషీ డిఫరెంట్ స్టైల్ లో కనిపించింది. థియేటర్లలో మిస్ అయిన ఓటీటీ థ్రిల్లర్ ప్రియులకు ఈ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

స్టోరీ ఏంటంటే?

బేబీ డూ డై డూ అనేది ముంబై నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ కథలో ప్రధాన పాత్ర అయిన బేబీ (హ్యూమా ఖురేషి) ఒక మూగ, చెవిటి కాంట్రాక్టు కిల్లర్. ఆమె బయట ప్రపంచానికి మామూలుగా కనిపిస్తూనే, ఒక సీక్రెట్ కాంట్రాక్ట్ కిల్లర్ గా మారుతుంది. చిన్నతనంలో తన కళ్ల ముందే దారుణంగా హత్యకు గురైన తన ట్విన్ సిస్టర్ చావుకు పగ తీర్చుకోవడమే లక్ష్యంగా బతుకుతుంది.

అయితే ఆ తర్వాతే సినిమాలో అదిరిపోయే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. అదే ఏంటో తెలుసుకోవాలంటే బేబీ డూ డై డూ మూవీని ఓటీటీలో చూడాల్సిందే.

సకీబ్ సలీమ్ ప్రొడక్షన్ డెబ్యూ

ఈ డార్క్ కామెడీ విత్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సకీబ్ సలీమ్, చుంకీ పాండే, సికందర్ ఖేర్‌లు కీలక పాత్రలు పోషించారు. సలీమ్ సిబ్లింగ్స్ (Saleem Siblings) బ్యానర్‌పై హ్యూమా ఖురేషీ, ఆమె సోదరుడు సకీబ్ సలీమ్ ఈ చిత్రాన్ని పూణే-04 పిక్చర్స్‌తో కలిసి స్వయంగా నిర్మించడం విశేషం. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ క్రైమ్ ఫీచర్‌ను ఇప్పుడు ఓటీటీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సరికొత్తగా హోమ్ ఆడియన్స్‌కు రీచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks