...
...
Next Story

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ దూకుడు.. అమ్మాయిల మిస్సింగ్ కేసు ఛేదించే పోలీస్.. తన కేసు తానే వాదించుకునే క్రిమినల్

ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్ మొదలై మూడు వారాలైనా.. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూనే ఉంది. తాజాగా మరో స్ట్రీమింగ్ రికార్డును క్రియేట్ చేసింది.

Published on: Nov 6, 2025, 19:36:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ కు ఓటీటీలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో తాజాగా జీ5 ఓటీటీలోకి వచ్చిన మూవీ నిరూపిస్తోంది. జీ5 ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పేరు భాగవత్ ఛాప్టర్ 1 రాక్షస్. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది.

భాగవత్ మూవీ స్ట్రీమింగ్ రికార్డు

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ దూకుడు.. అమ్మాయిల మిస్సింగ్ కేసు ఛేదించే పోలీస్.. తన కేసు తానే వాదించుకునే క్రిమినల్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ దూకుడు.. అమ్మాయిల మిస్సింగ్ కేసు ఛేదించే పోలీస్.. తన కేసు తానే వాదించుకునే క్రిమినల్

అర్షద్ వార్సీ లీడ్ రోల్లో నటించిన భాగవత్ ఛాప్టర్ 1 రాక్షస్ మూవీ 250 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది. గురువారం (నవంబర్ 6) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. “చేజ్ కొనసాగుతోంది.. అలాగే వ్యూస్ కూడా.. భాగవత్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. మూడు వారాలైనా ఇంకా దూసుకెళ్తూనే ఉందంటూ లేటెస్ట్ పోస్టర్ పై క్యాప్షన్ ఉంచింది. 25 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అంటే చాలా అరుదుగా సాధించే ఘనతే.

భాగవత్ మూవీ గురించి..

అర్షద్ వార్సీ, జితేంద్ర కుమార్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ భాగవత్ ఛాప్టర్ 1 రాక్షస్. ఈ సినిమా నేరుగా జీ5 ఓటీటీలోకే స్ట్రీమింగ్ కు వచ్చింది. అక్టోబర్ 17న ప్రీమియర్ అయింది. వచ్చిన తొలి రోజు నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అమ్మాయిల మిస్సింగ్ కేసు చుట్టూ సాగే మూవీ ఇది. కొత్తగా వచ్చిన డీసీపీ భాగవత్ ఈ కేసును ఎలా పరిష్కరించాడన్నది మూవీలో చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe