OTT Crime Thriller: ఓటీటీ లవర్స్‌ని కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు థ్రిల్ అందించే సరికొత్త ప్రైమ్ ఒరిజినల్ మూవీ డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మోనాలిసా (Mona Lisa) పెయింటింగ్‌ను టార్గెట్ చేస్తూ సాగే హై-వోల్టేజ్ ఆర్ట్ హైస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'మాస్టర్‌ప్లాన్' (Masterplan) అక్టోబర్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

తెలుగుతో పాటు ఇటాలియన్, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు థామస్ విన్సెంట్ (Thomas Vincent) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో హాలీవుడ్ లెజెండరీ నటుడు స్టాన్లీ తుచ్చి (Stanley Tucci), సిమోనా టబాస్కో, విక్టర్ బెల్మాండో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మాస్టర్‌ప్లాన్ మూవీ విశేషాలు
మూవీ టైటిల్ : Masterplan (మాస్టర్‌ప్లాన్)
ఓటీటీ : Amazon Prime Video (అమెజాన్ ప్రైమ్ వీడియో)
రిలీజ్ డేట్ : అక్టోబర్ 16, 2026
భాషలు : తెలుగు, ఇటాలియన్, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం
జానర్ : యాక్షన్, క్రైమ్ కామెడీ థ్రిల్లర్
డైరెక్టర్ : Thomas Vincent (థామస్ విన్సెంట్)
నటీనటులు : స్టాన్లీ తుచ్చి, సైమోనా తబాస్కో, విక్టర్ బెల్మాండో
మాస్టర్‌ప్లాన్ మూవీ స్టోరీ, ఊహించని ట్విస్ట్
ఓ రిటైర్డ్ లెజెండరీ దొంగ తన జీవితంలో అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన ఆర్ట్ చోరీ చేయడానికి ప్లాన్ చేస్తాడు. అందుకోసం ప్రపంచంలోనే అత్యంత విలువైన 'మోనాలిసా' పెయింటింగ్‌ను కొల్లగొట్టాలని డిసైడ్ అవుతాడు. ఈ భారీ మిషన్ కోసం ఇటలీకి చెందిన సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ కియారా (సిమోనా టబాస్కో), ఫ్రాన్స్‌కు చెందిన ఎక్స్‌ప్లోజివ్స్ స్పెషలిస్ట్ జే (విక్టర్ బెల్మాండో) అనే ఇద్దరు నిపుణులను తన టీమ్‌లోకి రిక్రూట్ చేసుకుంటాడు.
అయితే ప్లాన్ సక్సెస్ చేద్దామని రంగంలోకి దిగిన ఆ మాస్టర్ మైండ్‌కు ఒక బిగ్ షాక్ తగులుతుంది. తనతో పాటు పనిచేస్తున్న ఆ ఇద్దరు నిపుణులు మరెవరో కాదు, కొన్నేళ్ల క్రితం తనకు దూరమైన తన స్వయానా సొంత పిల్లలేనని అతనికి తెలుస్తుంది. తండ్రీ పిల్లలు ముగ్గురూ కలిసి తమ గొడవలను పక్కన పెట్టి, ఈ భారీ మిషన్‌ను ఎలా విజయవంతం చేశారు? ఆ తర్వాత జరిగే ఫన్నీ అండ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.
పర్ఫెక్ట్ వీకెండ్ బింజ్ వాచ్ ఆప్షన్
{{/usCountry}}అయితే ప్లాన్ సక్సెస్ చేద్దామని రంగంలోకి దిగిన ఆ మాస్టర్ మైండ్‌కు ఒక బిగ్ షాక్ తగులుతుంది. తనతో పాటు పనిచేస్తున్న ఆ ఇద్దరు నిపుణులు మరెవరో కాదు, కొన్నేళ్ల క్రితం తనకు దూరమైన తన స్వయానా సొంత పిల్లలేనని అతనికి తెలుస్తుంది. తండ్రీ పిల్లలు ముగ్గురూ కలిసి తమ గొడవలను పక్కన పెట్టి, ఈ భారీ మిషన్‌ను ఎలా విజయవంతం చేశారు? ఆ తర్వాత జరిగే ఫన్నీ అండ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.
పర్ఫెక్ట్ వీకెండ్ బింజ్ వాచ్ ఆప్షన్
{{/usCountry}}స్టాన్లీ తుచ్చి తన అద్భుతమైన నటనతో రిటైర్డ్ దొంగ పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లు ప్రమోషనల్ వీడియోలు చూస్తే తెలుస్తోంది. ఇక సిమోనా టబాస్కో, విక్టర్ బెల్మాండోల మధ్య వచ్చే కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ట్రీట్‌ను అందిస్తాయి.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాను హాలీవుడ్ రేంజ్లో నిలబెట్టాయి. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వీకెండ్లో 'మాస్టర్‌ప్లాన్' ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా హ్యాపీగా చూడొచ్చు.