...
...
Next Story

OTT Crime Thriller: థ్రిల్ కావాలా? పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ త‌మ్ముడి చావు-అన్న ఎంక్వైరీ-ఓటీటీలోకి ఉదయభాను క్రైమ్ థ్రిల్లర్!

OTT Crime Thriller: ఓటీటీ లవర్స్ గెట్ రెడీ. మీకు థ్రిల్ కావాలా? అయితే ఆ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేస్తోంది. ఉదయభాను ప్రొడక్షన్ లో ప్రేమిస్తే భరత్ హీరోగా నటించిన ఈ సిరీస్ మరో 6 రోజుల్లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Sep 5, 2026, 17:19:26 IST
Advertisement

OTT Crime Thriller: ఉదయభాను అంటే ఓ మంచి యాంకర్, ఓ టాలెంటెడ్ యాక్ట్రెస్ గానే తెలుసు. కానీ ఉదయభాను తన కెరీర్ లో కొత్త ఛాప్టర్ స్టార్ట్ చేసింది. ఆమె ప్రొడ్యూసర్ గా మారింది. ‘ఉదయభాను ప్రొడక్షన్’ బ్యానర్ పై ఫస్ట్ ప్రాజెక్ట్ ను తీసుకొస్తుంది. ఓటీటీలో నేరుగా సిరీస్ ను రిలీజ్ చేయనుంది.

పంచనామా ఓటీటీ

థ్రిల్ కావాలా? పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ త‌మ్ముడి చావు-అన్న ఎంక్వైరీ-ఓటీటీలోకి ఉదయభాను క్రైమ్ థ్రిల్లర్!
థ్రిల్ కావాలా? పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ త‌మ్ముడి చావు-అన్న ఎంక్వైరీ-ఓటీటీలోకి ఉదయభాను క్రైమ్ థ్రిల్లర్!

ఉదయభాను ప్రొడక్షన్ లో రూపుదిద్దుకున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ‘పంచనామా’. ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

తమ్ముడి హత్య

పంచనామా ఓటీటీ సిరీస్ స్టోరీ అంతా ఓ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ తమ్ముడి చావు చుట్టూ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో చనిపోయిన ఓ యువకుడి డెడ్ బాడీని చూపించారు. అది ఇన్‌స్పెక్ట‌ర్ జై రామ్ వాళ్ల తమ్ముడిది అని ఓ కానిస్టేబుల్ చెప్తాడు. ఈ కేసును జై రామ్ ఎంక్వైరీ చేస్తాడు. మిస్టరీని ఛేదించడానికి ట్రై చేస్తాడు.

ఆ మిస్టరీ ఏంటీ?

అయితే కేసు ఎంక్వైరీ చేస్తున్న జై రామ్ కు ఓ కాల్ వస్తుంది. ఈ కేసును మరీ పర్సనల్ గా తీసుకోవద్దని, ఇది జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే అని అవతలి పర్సన్ చెప్తాడు. ‘‘నేను యాక్సిడెంట్లను నమ్మను. ఆధారాలను మాత్రమే నమ్ముతాను’’ అని జై రామ్ చెప్పిన డైలాగ్ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. ఈ పంచనామా సిరీస్ లో తమ్ముడి చావు వెనుక ఉన్న మిస్టరీ ఏంటీ? అనేది జై రామ్ కనిపెట్టనున్నాడు.

ప్రేమిస్తే భరత్

పంచనామా సిరీస్ తో ప్రొడ్యూసర్ గా మారిన ఉదయభాను ఇందులో నటిస్తుందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. ఏదేమైనా థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ కోసం రెడీగా ఉండండి అంటూ ఈ పంచనామా సిరీస్ ఓటీటీ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మరి సిరీస్ లో ట్విస్ట్, సస్పెన్స్ ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe