Crime Thriller Web Series: ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'చార్ యార్' (Chaar Yaar) ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా లాక్ అయిపోయింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే, సికిందర్ ఖేర్, యంగ్ సెన్సేషన్ పురవ్ ఝా,పెద్ది విలన్ దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

"నలుగురు మిత్రులు.. ఒకే ఒక్క దొంగతనం.. ఇక వెనక్కి తిరిగేదే లేదు" అనే క్యాప్షన్ తో మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ వెబ్ సిరీస్ పై ఆసక్తిని ఒక్కసారిగా పెంచేసింది. 2000ల కాలం నాటి ముంబై నగర నేపథ్యంలో ఈ కథ సాగనుంది.
ముంబై క్రైమ్ అండర్‌వరల్డ్‌లో నలుగురు ఫ్రెండ్స్
2000ల ప్రారంభంలో ముంబై మహానగరంలోని మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌లో జై, టోనీ, సాహిల్, సమీర్ అనే నలుగురు స్నేహితుల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, మెరుగైన భవిష్యత్తు కోసం ఆరాటపడే ఆ నలుగురి మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే తమ కష్టాల నుంచి బయటపడటానికి వాళ్లు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం వాళ్ల జీవితాలను ఊహించని మలుపు తిప్పుతుంది.
చేసేదేమీ లేక ఒక దొంగతనానికి ఒడిగట్టిన ఆ ఫ్రెండ్స్, అనూహ్యంగా గ్యాంగ్‌స్టర్లు, పోలీస్ చేజింగ్ లతో కూడిన భయంకరమైన నేర ప్రపంచంలోకి అడుగుపెడతారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ఆ నలుగురు స్నేహితులు చేసిన పోరాటం ఏంటి? వాళ్ల స్నేహం వాళ్లను రక్షించిందా లేదా ముంచేసిందా అనేదే ఈ సిరీస్ మెయిన్ ప్లాట్.
క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి పర్‌ఫెక్ట్ ట్రీట్
ప్రసిద్ధ దర్శకుడు వినయ్ వైకుల్ ఈ వెబ్ సిరీస్ ని అద్భుతమైన టేకింగ్ తో తెరకెక్కించారు. సంబిత్ మిశ్రా, సౌరభ్ సావంత్ అందించిన స్క్రీన్ ప్లే ప్రతి ఎపిసోడ్ లోనూ ఊహించని ట్విస్టులతో సస్పెన్స్ క్రియేట్ చేయనుంది. ఈ సిరీస్ లో రాజేష్ తైలాంగ్, దివ్యేందు భట్టాచార్య, సయీ తమహంకర్, సాకిబ్ ఆయూబ్, భగవతి పెరుమాళ్ వంటి పవర్ఫుల్ స్టార్ కాస్టింగ్ ఉంది.
{{/usCountry}}ప్రసిద్ధ దర్శకుడు వినయ్ వైకుల్ ఈ వెబ్ సిరీస్ ని అద్భుతమైన టేకింగ్ తో తెరకెక్కించారు. సంబిత్ మిశ్రా, సౌరభ్ సావంత్ అందించిన స్క్రీన్ ప్లే ప్రతి ఎపిసోడ్ లోనూ ఊహించని ట్విస్టులతో సస్పెన్స్ క్రియేట్ చేయనుంది. ఈ సిరీస్ లో రాజేష్ తైలాంగ్, దివ్యేందు భట్టాచార్య, సయీ తమహంకర్, సాకిబ్ ఆయూబ్, భగవతి పెరుమాళ్ వంటి పవర్ఫుల్ స్టార్ కాస్టింగ్ ఉంది.
{{/usCountry}}అమెజాన్ ప్రైమ్ వీడియో హెడ్ నిఖిల్ మాధోక్ మాట్లాడుతూ.. ఫ్రెండ్‌షిప్, ఆంబిషన్, కామెడీ, అనూహ్యమైన ట్విస్టులు కలగలిపిన రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సిరీస్ ఇదని వెల్లడించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రైమ్ వీడియో ఎప్పుడూ ముందుంటుందని, ఈ యంగ్ స్టార్స్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని ఖచ్చితంగా మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అక్టోబర్ 23 నుంచి ఈ వెబ్ సిరీస్ హిందీ భాషలో ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మీర్జాపూర్, పాతాళ్ లోక్ వంటి డార్క్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే ఆడియన్స్ కి 'చార్ యార్' ఒక గ్రేట్ వాచ్ కాబోతోంది.