Crime Thriller Web Series: ఓటీటీ ప్రియులను మునివేళ్ల మీద నిలబెట్టే సరికొత్త హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తోంది. 2000వ దశకం ప్రారంభంలోని ముంబై నగర నేపథ్యంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సిరీస్ 'చార్ యార్' (Chaar Yaar) అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఒక గ్రిప్పింగ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అనుభూతిని పంచడానికి సిద్ధమైంది. యువతను ఆకట్టుకునే నటీనటులతో పాటు సీనియర్ నటుల అద్భుతమైన కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
చార్ యార్ వెబ్ సిరీస్ విశేషాలు
వెబ్ సిరీస్ టైటిల్ : Chaar Yaar (చార్ యార్)
ఓటీటీ : Amazon Prime Video (అమెజాన్ ప్రైమ్ వీడియో)
రిలీజ్ డేట్ : అక్టోబర్ 23, 2026
ఎపిసోడ్లు : 8
జానర్ : క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు : పూరవ్ ఝా, నమన్ జైన్, సాఖిబ్ ఆయుబ్, ప్రయ్రాక్ మెహతా, సయీ తమహంకర్, సికందర్ ఖేర్, చుంకీ పాండే
నలుగురు స్నేహితుల కథ, అండర్ వరల్డ్ ఉచ్చు
ఈ చార్ యార్ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. 2000 ప్రారంభంలో ముంబై నేపథ్యంలో నలుగురు మధ్యతరగతి యువకుడు, స్నేహితులు అయిన జయ్, టోనీ, సాహిల్, సమీర్ జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మెరుగైన భవిష్యత్తును సాధించాలనే కోరిక, కుటుంబ బాధ్యతల ఒత్తిడి మధ్య నలిగిపోయే ఈ నలుగురు యువకులు.. జీవితంలో ఒకే ఒక్క చిన్న కారుతో తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అయితే అనుకోని పరిస్థితుల్లో వారు తీసుకునే ఒకే ఒక్క తప్పుడు, ప్రమాదకరమైన నిర్ణయం వారిని ముంబై అండర్ వరల్డ్, నేర సామ్రాజ్యంలోకి నడిపిస్తుంది.
సరదాగా తిరుగుతూ కార్లు చోరీ చేసే యువకులుగా ఉన్న వీరు నేర ప్రపంచంలో ఎలా ఎదిగారు? ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ క్రైమ్ డ్రామాను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
చార్ యార్ ట్రైలర్ ఎలా ఉందంటే?
{{/usCountry}}సరదాగా తిరుగుతూ కార్లు చోరీ చేసే యువకులుగా ఉన్న వీరు నేర ప్రపంచంలో ఎలా ఎదిగారు? ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ క్రైమ్ డ్రామాను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
చార్ యార్ ట్రైలర్ ఎలా ఉందంటే?
{{/usCountry}}తాజాగా ఈ చార్ యార్ వెబ్ సిరీస్ ట్రైలర్ ను ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో కార్లు చోరీ చేయడంలో నైపుణ్యం సాధించిన నలుగురు యువకులు.. ఆ తర్వాత ముంబై అండర్ వరల్డ్ డాన్ తో చేతులు కలపడం చూడొచ్చు. అయితే ఆ నిర్ణయమే వాళ్ల జీవితాలను మార్చేస్తుంది.
ఈ వెబ్ సిరీస్‌లో పూరవ్ ఝా, నమన్ జైన్, సాకిబ్ అయూబ్, ప్రయాక్ మెహతా ప్రధాన పాత్రల్లో నటిస్తూ తమ సహజమైన నటనతో ఆకట్టుకోనున్నారు. వీరితో పాటు సయీ తమహంకర్, సిందర్ ఖేర్, దిబ్యేందు భట్టాచార్య, రాజేష్ తైలంగ్, చుంకీ పాండే వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించి సిరీస్ స్థాయిని పెంచారు.
2000 నాటి ముంబై వాతావరణాన్ని, అండర్ వరల్డ్ సెటప్‌ను రియలిస్టిక్‌గా చూపించిన సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలవనున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఆడియన్స్‌కు అక్టోబర్ 23 నుంచి పర్ఫెక్ట్ బింజ్ వాచ్ ఆప్షన్ ఇది.