Dacoit OTT: ఓటీటీ ఆడియన్స్ కు మరింత కిక్ అందించేందుకు కొత్త ఫ్రైడ్ వచ్చింది. శుక్రవారం వస్తూనే ఓటీటీలో కొత్త సినిమాలను తీసుకొచ్చింది. రీసెంట్ తెలుగు రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఈ రోజే (మే 8) ఓటీటీలోకి వచ్చేసింది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ఓటీటీ డెబ్యూ చేసింది.
డెకాయిట్ ఓటీటీ

తెలుగు లేటెస్ట్ రొమాంటిక్ రివేంజ్ డ్రామా ‘డెకాయిట్’ ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ నుంచే డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి డెకాయిట్ వచ్చేసింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో డెకాయిట్ స్ట్రీమింగ్ అవుతోంది.
కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్
ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో రిలీజైన డెకాయిట్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇందులో అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, కామాక్షి భాస్కర్ల, సునీల్, అతుల్ కులకర్ణి, వైభవ్ తదితరులు నటించారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్ అందించాడు. షానియల్ డియో డైరెక్టర్.
డెకాయిట్ మూవీ స్టోరీ
హరిదాస్ (అడివి శేష్), సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) లవర్స్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ, అనూహ్యంగా హరిదాస్ 13 ఏళ్ల జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అందుకు కారణం తను ప్రాణంగా ప్రేమించిన సరస్వతి కావడంతో ఆమెపై హరిదాస్ పగ పెంచుకుంటాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటాడు.
జైలు నుంచి ఎస్కేప్
ఈ క్రమంలోనే హరిదాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. దుబాయ్ వెళ్లాలనుకుంటాడు. అందుకు రూ. 60 లక్షలు అవసరం అవుతాయి. మరోవైపు ఆరేళ్ల కూతురికి తల్లిగా, అనారోగ్యంతో మంచాన పడిన భాస్కర్ (వైభవ్)కు భార్యగా సరస్వతి ఉంటుంది.
{{/usCountry}}ఈ క్రమంలోనే హరిదాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. దుబాయ్ వెళ్లాలనుకుంటాడు. అందుకు రూ. 60 లక్షలు అవసరం అవుతాయి. మరోవైపు ఆరేళ్ల కూతురికి తల్లిగా, అనారోగ్యంతో మంచాన పడిన భాస్కర్ (వైభవ్)కు భార్యగా సరస్వతి ఉంటుంది.
{{/usCountry}}అప్పుడే పాప ఆరోగ్యం కోసం సరస్వతికి రూ. 1 కోటి అవసరం పడుతుంది. దీంతో హరిదాస్, సరస్వతి ఇద్దరు కలిసి భారీ దొంగతనం ప్లాన్ చేస్తారు. అయితే డబ్బు కొట్టేసి జూలియట్‌ను పోలీసులకు ఇరికించాలన్నది హరిదాస్ ప్లాన్.
మరి హరిదాస్ ప్లాన్ వర్కౌట్ అయిందా? సరస్వతిపై హరికి ఉన్న పగ ఏంటీ? ఎంతో ప్రేమించిన హరిని జూలియట్ ఎందుకు జైలుకు పంపించింది? సీఐ స్వామి అలియాస్ రాంబాబు (అనురాగ్ కశ్యప్), కరుణ హాస్పిటల్స్ ఛైర్మన్ (ప్రకాష్ రాజ్), మల్లి (కామాక్షి భాస్కర్ల) పాత్రల ప్రాధాన్యత ఏంటీ? అనేది తెలుసుకోవాలంటే డెకాయిట్ చూడాల్సిందే.