...
...
Next Story

Rana Daggubati OTT: రానా మెచ్చిన మూవీ.. తెలుగు సినిమాపై ప్రశంసలు.. ఈ వండర్ ఫిల్మ్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?

Rana Daggubati OTT: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ఓ తెలుగు మూవీపై ప్రశంసలు కురిపించాడు. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రానికి అతను ఫిదా అయ్యాడు. మరి రానా మెచ్చిన మూవీ ఏదీ? అది ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో? చూసేయండి.

Published on: Jun 16, 2026, 09:57:19 IST
Advertisement

Rana Daggubati OTT: వినూత్న చిత్రం 'సింగ్ గీతం' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. వైవిధ్యమైన కథాంశంతో, అద్భుతమైన ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ ఐకాన్, భల్లాలదేవ రానా దగ్గుబాటి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సినిమాను, చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

రానా దగ్గుబాటి పోస్ట్

రానా మెచ్చిన మూవీ.. ఈ వండర్ ఫిల్మ్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే? (x/RanaDaggubati)
రానా మెచ్చిన మూవీ.. ఈ వండర్ ఫిల్మ్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే? (x/RanaDaggubati)

కథల్లో కొత్తదనాన్ని, ప్రయోగాత్మక చిత్రాలను ఎల్లప్పుడూ ప్రోత్సహించే రానా దగ్గుబాటి.. 'సింగ్ గీతం' సినిమా చూసి ముగ్దుడయ్యాడు. తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సినిమా గొప్పదనాన్ని వివరిస్తూ ఒక ప్రత్యేకమైన నోట్ రాశాడు.

"సాధారణ నిబంధనలను సవాలు చేస్తూ, కథలు చెప్పే విధానంలో సరిహద్దులను చెరిపేస్తూ, సాధారణ విషయాలకు లొంగిపోవడానికి నిరాకరించే పట్టుదల గల కలలు కనేవారు ప్రతి తరంలోనూ పుడతారు. వారి వల్లే సినిమా అనే కళ ఇప్పటికీ బతికి ఉంది" అని రానా దగ్గుబాటి గొప్పగా చెప్పుకొచ్చాడు.

తప్పక చూడాల్సిన సినిమా

"అలాంటి వారి సృజనాత్మకత కేవలం వినోదం మాత్రమే కాకుండా, మనలోని మానవత్వాన్ని మళ్లీ గుర్తుచేసే ఒక గొప్ప కళగా మారుతుంది. 'సింగ్ గీతం' సినిమా సరిగ్గా అలాంటి కోవకు చెందినదే. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం" అని రానా చిత్ర యూనిట్‌ను కొనియాడాడు.

ట్రేడ్ కోణం

రానా లాంటి పెద్ద నటుడి నుండి ఇటువంటి ప్రశంసలు దక్కడం సినిమాకు మరింత మైలేజ్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ హంగుల కంటే కథను నమ్మి తీసిన ఈ సినిమాకు ఇలాంటి మద్దతు ఎంతో అవసరమని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

'సింగ్ గీతం' ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

'సింగ్ గీతం' చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌మంచి ధరకు దక్కించుకుంది. అయితే, ఈ సినిమా థియేట్రికల్ రన్ ఇంకా ముగియనందున, చిత్ర నిర్మాతలు అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. థియేటర్లలో సినిమా రన్ పూర్తయిన తర్వాత, వచ్చే నెల ద్వితీయార్థంలో ఈ చిత్రం ఓటీటీ వీక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల టాక్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks