డెక్కన్ కిచెన్ వర్సెస్ దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టు కేసులో వస్తున్న వార్తలపై దగ్గుబాటి సురేష్ సీరియస్ అయ్యారు. తప్పుడు వివరాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్స్ తప్పవని సురేష్ బాబు లీగల్ టీమ్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇంతకు ఏమైంది? ఈ కేసు సంగతి ఏంటీ? అన్నది ఇప్పుడు చూద్దాం.
అది పచ్చి అబద్దం

జూబ్లీహిల్స్ లోని డెక్కన్ కిచెన్ స్థల వివాదంలో దగ్గుబాటి కుటుంబం మీద కేసు నడుస్తోంది. బలవంతంగా తమను రౌడీలతో సాయంతో ఖాళీ చేయించారని నంద కుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై నాంపల్లి కోర్టు విచారణ కొనసాగిస్తోంది. అయితే కోర్టులో అది జరిగిందని, ఇది జరిగిందని వస్తున్న వార్తలు పచ్చి అబద్దాలని సురేష్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
కోర్టుకు హాజరు కావాలని
‘‘దగ్గుబాటి ఫ్యామిలీ పై వస్తోన్న వార్తలు అవాస్తవం. కోర్ట్ కి హాజరు కావాలన్నది పచ్చి అబద్ధం. జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ కేసు విషయంలో నాంపల్లి కోర్టులో దగ్గుబాటి కుటుంబానికి చుక్కెదురైందని. కోర్టు ఆర్డర్లను ధిక్కరించినందుకు జడ్జి సీరియస్ అయ్యారని, సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్టు వస్తోన్న వార్తలు నిజం కాదు’’ అని ఆ ప్రెస్ నోట్ లో సురేష్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ పేర్కొంది.
నాన్ బెయిలబుల్ వారెంట్
‘‘వచ్చే నెల 5 న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. సహజంగానే కేసు 05/02/2026కి వాయిదా పడింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వాస్తవాలను ప్రచారం చేయవద్దని కోరుతున్నాము’’ అని ప్రెస్ నోట్ లో తెలిపింది.
చర్యలు తీసుకుంటామని
దగ్గుబాటి కుటుంబంపై తప్పుడు వార్తలు, వివరాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ తమ ప్రెస్ నోట్ లో వార్నింగ్ ఇచ్చింది. ‘‘తప్పుడు వివరాలు ప్రచురించితే చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది’’ అని పేర్కొంది.
ఏమైందంటే?
{{/usCountry}}దగ్గుబాటి కుటుంబంపై తప్పుడు వార్తలు, వివరాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ తమ ప్రెస్ నోట్ లో వార్నింగ్ ఇచ్చింది. ‘‘తప్పుడు వివరాలు ప్రచురించితే చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది’’ అని పేర్కొంది.
ఏమైందంటే?
{{/usCountry}}ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని సుమారు 1,000 గజాల స్థలాన్ని 2014లో దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్ నుంచి వ్యాపారవేత్త నందకుమార్ లీజుకు తీసుకున్నారు. అక్కడ 'డెక్కన్ కిచెన్' అనే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే లీజు గడువు తీరకముందే స్థలాన్ని ఖాళీ చేయాలని దగ్గుబాటి కుటుంబం తనపై ఒత్తిడి తెచ్చిందని నందకుమార్ సివిల్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే ఇచ్చింది.
కూల్చివేతతో
అయితే నవంబర్ 2022లో అనుమతులు లేవని ఆ రెస్టారెంట్ ను జీహెచ్ఎంసీ పాక్షికంగా కూల్చివేసింది. కోర్టు స్టే ఉన్నా అధికారులు, దగ్గుబాటి కుటుంబంతో కుమ్మక్కై ఇలా చేశారని నందకుమార్ ఆరోపించారు. ఇక 2024 జనవరిలో దగ్గుబాటు ఫ్యామిలీ రౌడీలతో రెస్టారెంట్ ను పూర్తిగా కూల్చివేయించారని నందకుమార్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఇవాళ (జనవరి 23) దీనిపై విచారణ జరిగింది. అయితే కోర్టులో జరిగింది తెలియకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని సురేష్ బాబు టీమ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.