...
...
Next Story

David Dhawan: పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్- 74 ఏళ్ల వయసులో డైరెక్టర్ రీ ఎంట్రీ- కారణం చెప్పిన కొడుకు వరుణ్!

David Dhawan Re Entry Reason At Age 74: బాలీవుడ్ ప్రముఖ కామెడీ చిత్రాల దర్శకుడు డేవిడ్ ధావన్ ఆరేళ్ల విరామం తర్వాత హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా చేసిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ముంబైలో జరిగింది. ఈ క్రమంలో దర్శకుడు కొడుకు కారణం చెప్పాడు.

Published on: May 24, 2026, 06:50:09 IST
Advertisement

David Dhawan Re Entry Reason At Age 74: బాలీవుడ్‌లో అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. 74 ఏళ్ల వయసులో, సాధారణంగా చాలా మంది విశ్రాంతి తీసుకునే రోజుల్లో ఆయన సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇస్తున్నారు.

హై జవానీ తో ఇష్క్ హోనా హై ట్రైలర్ లాంచ్

పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్- 74 ఏళ్ల వయసులో డైరెక్టర్ రీ ఎంట్రీ- కారణం చెప్పిన కొడుకు వరుణ్!
పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్- 74 ఏళ్ల వయసులో డైరెక్టర్ రీ ఎంట్రీ- కారణం చెప్పిన కొడుకు వరుణ్!

ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో డేవిడ్ ధావన్ కుమారుడు, ఈ మూవీ హీరో వరుణ్ ధావన్ తన తండ్రి రీఎంట్రీ వెనుకున్న అసలు కారణాన్ని వెల్లడించారు.

తెలుగు ప్రేక్షకులకు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు ఎలాంటి వినోదాన్ని పంచాయో, హిందీలో డేవిడ్ ధావన్ మార్క్ కామెడీ చిత్రాలు అలాంటి నవ్వుల పండగను సృష్టించాయి. గోవిందాతో ఆయన చేసిన 'రాజా బాబు', 'కూలీ నెం.1', 'బీవీ నెం.1' వంటి చిత్రాలు తెలుగులోనూ రీమేక్ అయి ఇక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అదే నవ్వుల ఫార్ములాతో డేవిడ్ ధావన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

నవ్వించడమే మా కుటుంబ సిద్ధాంతం

ప్రస్తుత కాలంలో థియేటర్లకు వచ్చే సినిమాల విజయాలపై ఇండస్ట్రీలోనే రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయని వరుణ్ ధావన్ పేర్కొన్నారు. "ఈ వయసులో కూడా నాన్న సినిమా తీయడం నిజంగా అద్భుతం. ప్రతి శుక్రవారం సినిమా ఆడుతుందో లేదో అని అందరం టెన్షన్ పడుతున్న రోజులివి. కానీ, నాన్న మాత్రం కేవలం ప్రేక్షకులను నవ్వించాలనే బలమైన నమ్మకంతో ఈ సినిమా తీశారు. మా కుటుంబానికి ఒకే ఒక సిద్ధాంతం ఉంది, అది జనాలను నవ్వించడం మాత్రమే" అని వరుణ్ ధావన్ స్పష్టం చేశారు.

హై జవానీ తో ఇష్క్ హోనా హై ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డేవిడ్ ధావన్ తన కుమారుడు వరుణ్ గురించి మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. వరుణ్ కేవలం మంచి నటుడే కాదు, అంతకంటే మంచి కొడుకంటూ ప్రశంసలు కురిపించారు.

"నటుడిగా వరుణ్ రోజురోజుకూ ఎదుగుతున్నాడు, ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నాడు. కానీ, ఒక తండ్రిగా చెప్తున్నాను.. ప్రతి ఒక్కరికీ వరుణ్ లాంటి కొడుకే పుట్టాలి. నేను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వరుణ్ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. నాతోపాటే ఆసుపత్రి గదిలోనే పడుకునేవాడు. ఒక తండ్రికి ఇంతకంటే ఏం కావాలి?" అంటూ డేవిడ్ ధావన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

తెలుగు భామల సందడి

ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో వరుణ్ ధావన్‌ సరసన మన టాలీవుడ్ బ్యూటిఫుల్ భామలు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై సౌత్ ఇండియాలోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

రమేష్ తౌరానీ 'టిప్స్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా, గౌరవ్ బోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మనీష్ పాల్, చుంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సమ్మర్ కానుకగా జూన్ 5వ తేదీన హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks