...
...
Next Story

28 ఏళ్ల అమ్మాయితో 52 ఏళ్ల వ్యక్తి లవ్-ఓటీటీలోకి వచ్చేసిన రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ-100 కోట్ల సినిమా

28 ఏళ్ల అమ్మాయి, 52 ఏళ్ల అబ్బాయి మధ్య లవ్ స్టోరీని రొమాంటిక్ కామెడీగా చూపించిన సినిమా దే దే ప్యార్ దే 2. రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగణ్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

Published on: Jan 9, 2026, 13:02:39 IST
Advertisement

అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ 'దే దే ప్యార్ దే 2' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 28 ఏళ్ల అమ్మాయి, 52 ఏళ్ల పురుషుడి మధ్య లవ్ చూట్టూ సాగుతుంది.

దే దే ప్యార్ దే 2 ఓటీటీ

ఓటీటీలో దే దే ప్యార్ దే 2
ఓటీటీలో దే దే ప్యార్ దే 2

శుక్రవారం చాలా సినిమాలే ఓటీటీలోకి వచ్చాయి. అందులో ఒకటి దే దే ప్యార్ దే 2. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ (జనవరి 9) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులు, విమర్శకుల నుంచి సానుకూల స్పందనను అందుకుంది ఈ మూవీ. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసలు దక్కించుకుంది. చలికాలంలో హాయిగా నవ్వుకోవడానికి ఇది సరైన సినిమా.

సీక్వెల్

2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దే దే ప్యార్ దే మూవీకి సీక్వెల్ ఈ దే దే ప్యార్ దే 2. ఇందులో అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ సింగ్.. ఆశిష్ మెహ్రా, అయేషా ఖురానాగా తమ పాత్రల్లోనే తిరిగి నటించారు. 'దే దే ప్యార్ దే 2' లో అయేషా తండ్రిగా ఆర్. మాధవన్, తల్లిగా గౌతమి కపూర్ పరిచయమయ్యారు. ఈ చిత్రంలో జావేద్ జాఫెరి, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్తా, తరుణ్ గెహ్లోట్, సంజీవ్ సేథ్, సుహాసిని ములే, గ్రేసీ గోస్వామి, జ్యోతి గౌబా కూడా నటించారు.

పాజిటివ్ టాక్

లండన్ లో ఉండే 52 ఏళ్ల ఎన్నారై పెట్టుబడిదారుడు ఆశిష్ మెహ్రా. అతని కంటే చాలా చిన్నదైన 28 ఏళ్ల అయేషా ఖురానాను ప్రేమిస్తాడు. అయేషా కుటుంబం వారి ప్రేమకథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

'ఆశిష్ అయేషా ఇంటికి వచ్చినప్పుడు ప్రేమ తన కఠినమైన పరీక్షను ఎదుర్కొంటుంది. వయసు వ్యత్యాసం ఉన్న ప్రేమకథ హృదయాలను గెలుచుకుంటుందా లేక గందరగోళాన్ని సృష్టిస్తుందా? ఈ ప్యార్ వర్సెస్ పరివార్ క్లాష్ అన్ని రకాల ప్రేక్షకులకు ఆసక్తికరమైన, హాస్యభరితమైన ప్రయాణాన్ని అందిస్తుందని హామీ ఇస్తుంది' అని దే దే ప్యార్ దే 2 మూవీ గురించి ఐఎండీబీ పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks