...
...
Next Story

ఓటీటీలో కల్కి 2898 ఏడీ.. టైటిల్ కార్డ్స్ నుంచి దీపికా పదుకొణె పేరు మిస్సింగ్.. అన్‌ప్రొఫెషనల్ అంటూ ఫ్యాన్స్ రచ్చ

కల్కి 2898 ఏడీ, దీపికా పదుకొణె వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఓటీటీలో కల్కి 2898 ఏడీ స్ట్రీమింగ్ ఎండ్ కార్డు టైటిల్స్ లో దీపికా పదుకొణె పేరు మిస్సవడం హాట్ టాపిక్ గా మారింది. అన్‌ప్రొఫెషనల్‌ అంటూ దీపికా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Published on: Oct 29, 2025, 14:32:24 IST
Advertisement

కల్కి 2898 AD సీక్వెల్ నుంచి దీపికా పదుకొణెను తప్పించడంతో మొదలైన వివాదానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా లేదు. కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే బుధవారం (అక్టోబర్ 29) స్ట్రీమింగ్‌లో ఉన్న సినిమా ఎండ్ క్రెడిట్స్‌లో దీపికా పేరు మిస్సయింది. ఈ విషయాన్ని అభిమానులు గమనించారు. దీంతో మరోసారి కల్కి, దీపికా కాంట్రవర్సీ హాట్ టాపిక్ గా మారింది.

అన్‌ప్రొఫెషనల్‌ అంటూ

కల్కి 2898 ఏడీలో దీపికా పదుకొణె
కల్కి 2898 ఏడీలో దీపికా పదుకొణె

కల్కి 2898 ఏడీ పోస్టర్ లో ఉన్న ముగ్గురు ముఖాలలో దీపికా పదుకొణె ఒకరు. ప్రభాస్, అమితాబ్ తో పాటు దీపికా ఫొటో ఉంది. అలాంటిది మూవీ క్రెడిట్స్ లో దీపికా పేరు లేకపోవడం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఎడిట్ చేసిన ఎండ్ క్రెడిట్స్ వీడియోలు, స్క్రీన్‌గ్రాబ్‌లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అభిమానులు దీపికాకు మద్దతుగా నిలిచి, చిత్ర నిర్మాతలను 'అన్‌ప్రొఫెషనల్‌' అని విమర్శిస్తున్నారు.

దీపికా రోల్

కల్కి 2898 ఏడీ, ఒక డిస్టోపియన్ సైన్స్-ఫిక్షన్, పౌరాణిక ఫాంటసీ చిత్రం. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా ప్రధాన పాత్రలలో నటించారు. ఇందులో దీపికా SUM-80 అనే గర్భిణీ స్త్రీ పాత్రను పోషించారు, ఆమెను బౌంటీ హంటర్ ప్రభాస్ వేటాడుతుండగా, అశ్వత్థామ (అమితాబ్) రక్షిస్తాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహాభారతంలోని అంశాలను డిస్టోపియన్ సైన్స్-ఫిక్షన్‌తో మిళితం చేసి రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. దీని సీక్వెల్ కూడా రానుంది.

క్రెడిట్స్ లో కనిపించన దీపికా పేరు

మళ్లీ వెంటనే

ఫ్యాన్స్ ఫైర్

సర్క్యులేట్ అవుతున్న వీడియోలలో క్రెడిట్ కనిపించకపోవడంతో దీపికా అభిమానులు చిత్ర నిర్మాతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక దీపికా ఫ్యాన్ పేజీ సోషల్ మీడియాలో ఎండ్ క్రెడిట్స్ వీడియోను షేర్ చేస్తూ, “ కల్కి పార్ట్ 1 ఓటీటీ వర్షన్ క్రెడిట్స్ నుండి దీపికా పదుకొణె పేరును తొలగించారు” అని పేర్కొంది. గత నెలలో కల్కి 2898 AD నిర్మాతలైన వైజయంతీ మూవీస్ ఈ సినిమా సీక్వెల్‌లో దీపికా ఇకపై భాగం కాదని ప్రకటించారు.

8 గంటల పని

పెరిగిన పారితోషికం, తక్కువ పని గంటలతో సహా దీపికా 'అన్‌ప్రొఫెషనల్' డిమాండ్ల కారణంగానే కల్కి సీక్వెల్ నుంచి దీపికాను తప్పించే నిర్ణయం తీసుకున్నారని తర్వాత నివేదికలు పేర్కొన్నాయి. ఎండ్ క్రెడిట్స్ నుండి దీపికా పేరు మాయం కావడంపై వైజయంతీ మూవీస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కొత్త తల్లిగా 8-గంటల షిఫ్ట్ డిమాండ్ చేయడం వల్ల దీపికా ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' నుండి కూడా తప్పుకొంది. ఈ నటి ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో 'కింగ్'లో, అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో నటిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks