బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ ఈసారి దీపావళిని మరింత ప్రత్యేకంగా మార్చారు. తొలిసారిగా తమ కూతురు దువా పదుకోన్ సింగ్ ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ ఎరుపు రంగు దుస్తులలో మెరిసిపోగా, లక్ష్మీ పూజలో దువా పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దువా పదుకోన్ క్యూట్ లుక్స్

దీపావళిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగు సినిమా సెలబ్రిటీలతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పండుగ వైబ్స్ ను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈసారి దీపావళిని బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ మరింత ప్రత్యేకంగా మార్చారు. తమ కూతురు దువా పదుకోన్ సింగ్ ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు.
దీపికా, రణ్‌వీర్ సింగ్ ఇద్దరూ కలిసి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఉమ్మడి పోస్ట్ పెట్టారు. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ పోస్ట్‌ను ప్రత్యేకంగా మార్చింది మాత్రం వారి క్యూట్ ఫ్యామిలీ పిక్చర్. వీరు ముగ్గురూ ఎరుపు పేస్టల్ రంగులలో ఒకే రకమైన దుస్తులు ధరించి ఉన్న కారౌసెల్ ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫొటోలలో ఈ పేరెంట్స్ తమ కూతురిని ఆప్యాయంగా చూస్తున్నారు. రెండు చిన్న పిలకలతో దువా ఒక్కో ఫోటోలో ఒక్కోలా క్యూట్ గా అల్లరి చేస్తూ మరింత ముద్దుగా కనిపించింది. ఇక చివరి ఫొటోలో దీపిక ఒడిలో దువా కూర్చుని లక్ష్మీ పూజ చేస్తున్న దృశ్యం ఉంది. దీపికా, తన కూతురి చేతులను పట్టుకుని, దేవతకు నమస్కరిస్తూ ఇచ్చిన పోజు ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఏడాది దాటిన దువా
తల్లిదండ్రులు దీపిక, రణ్‌వీర్ తమ కుమార్తె ముఖాన్ని ప్రపంచానికి చూపించడం ఇదే మొదటిసారి. వారి కూతురు దువా సెప్టెంబర్ 8, 2024న జన్మించింది. ఆమె పుట్టిన వెంటనే ఈ సెలబ్రిటీ కపుల్ మీడియాను ఆహ్వానించి ఒక అభ్యర్థన చేశారు. తమ కూతురిని ప్రపంచానికి పరిచయం చేయడానికి సరైన సమయం వచ్చే వరకు బహిరంగ ప్రదేశాల్లో దువా ఫోటోలను క్లిక్ చేయవద్దని కోరారు.
{{/usCountry}}తల్లిదండ్రులు దీపిక, రణ్‌వీర్ తమ కుమార్తె ముఖాన్ని ప్రపంచానికి చూపించడం ఇదే మొదటిసారి. వారి కూతురు దువా సెప్టెంబర్ 8, 2024న జన్మించింది. ఆమె పుట్టిన వెంటనే ఈ సెలబ్రిటీ కపుల్ మీడియాను ఆహ్వానించి ఒక అభ్యర్థన చేశారు. తమ కూతురిని ప్రపంచానికి పరిచయం చేయడానికి సరైన సమయం వచ్చే వరకు బహిరంగ ప్రదేశాల్లో దువా ఫోటోలను క్లిక్ చేయవద్దని కోరారు.
{{/usCountry}}మీడియా కూడా వారి అభ్యర్థనను గౌరవించింది. అయితే ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో ఒక అభిమాని దీపికా, దువా ఫోటో తీయడానికి ప్రయత్నించగా.. నటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన కూడా జరిగింది. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా దువా ముఖాన్ని అఫీషియల్‌గా చూపించడంతో ఫ్యాన్స్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు.