Deepika Padukone: మీ అందరి కంటే ముందు ధురంధర్ 2 చూశాను.. కావాలనే ఇలా..: ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇచ్చిన దీపికా పదుకోన్
Deepika Padukone: ధురంధర్ 2 మూవీ సక్సెస్ పై మాట్లాడటం లేదంటూ తనపై వస్తున్న ట్రోల్స్ కు దీపికా పదుకోన్ గట్టి సమాధానం ఇచ్చింది. మీ అందరి కంటే ముందే ఆ మూవీ చూశానని ఆమె చెప్పడం విశేషం.
Deepika Padukone: బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్: ది రివెంజ్' సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా సక్సెస్‌ను యావత్ బాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంటోంది. అయితే ఈ ఆనందంలో రణవీర్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఎక్కడా కనిపించకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

తన భర్త సాధించిన ఇంతటి ఘనవిజయంపై దీపిక ఎందుకు స్పందించడం లేదంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై దీపికా పదుకోన్ తనదైన శైలిలో స్పందిస్తూ విమర్శకుల నోళ్లు మూయించింది.
"మీకంటే ముందే చూశాను.. ఇప్పుడు ఎవరిని చూసి నవ్వాలి?"
తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా రణవీర్ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై వస్తున్న విమర్శలకు దీపికా పదుకోన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఘాటు సమాధానం ఇచ్చింది. ఒక పోస్ట్‌పై స్పందిస్తూ.. "మీ అందరికంటే చాలా ముందే నేను ఈ సినిమా చూశాను. ఇప్పుడు చెప్పండి.. జోక్ ఎవరి మీద?" అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చింది.
కావాలనే తాను దీనిపై పెద్దగా స్పందించలేదన్నట్లుగా వచ్చిన పోస్టుపై దీపికా స్పందించింది. సెలబ్రిటీల మధ్య ఉండే బంధాన్ని కేవలం సోషల్ మీడియా పోస్టులు, లైకులు, షేర్లతోనే కొలిచే వారికి దీపికా ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భర్త సక్సెస్‌ను పబ్లిక్‌గా ప్రదర్శించాల్సిన అవసరం లేదని, తన మద్దతు ఎప్పుడూ ఆయనకు ఉంటుందని ఆమె పరోక్షంగా స్పష్టం చేసింది.
బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల ప్రభంజనం
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్: ది రివెంజ్' భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం ఇండియాలోనే రూ.1,000 కోట్ల క్లబ్ లో చేరిన తొలి హిందీ మూవీగా రికార్డు సృష్టించింది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.. బాలీవుడ్ గతాన్నే తిరగరాస్తోంది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఈ మూవీ త్వరలోనే 'పుష్ప 2', 'దంగల్' వంటి చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా అధిగమించే అవకాశం ఉంది.
గతంలోనే ప్రశంసల జల్లు.. కానీ నెటిజన్ల మతిమరుపు
నిజానికి దీపికా ఈ సినిమాపై స్పందించకపోవడం అనే మాటలో వాస్తవం లేదు. 2025 డిసెంబర్‌లో సినిమా విడుదలైన సమయంలోనే ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా అద్భుతమైన రివ్యూ ఇచ్చింది.
"3 గంటల 36 నిమిషాల పాటు సాగే ఈ సినిమా ప్రతి సెకను అద్భుతం. థియేటర్లకు వెళ్లి చూడండి" అని అభిమానులకు సూచించింది. అంతేకాకుండా హమ్జా అలీ మజారీ (జస్కిరత్ సింగ్ రంగీ) పాత్రలో రణవీర్ నటనను చూసి గర్వపడుతున్నానని ఆమె అప్పుడే పేర్కొంది. అయినప్పటికీ ప్రస్తుత సక్సెస్ మీట్లలో ఆమె కనిపించకపోవడంతో నెటిజన్లు మళ్ళీ పాత కథను తెరపైకి తెచ్చారు.
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. ఉగ్రవాద మూకల కుట్రలను తిప్పికొట్టే ఒక పవర్‌ఫుల్ మిషన్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ధురంధర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది?
ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్ల మార్కును దాటిన తొలి హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది.
2. తన భర్త సినిమాపై దీపికా పదుకోన్ స్పందన ఏమిటి?
తనను ట్రోల్ చేస్తున్న వారికి దీపికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "నేను మీకంటే ముందే సినిమా చూశాను" అని పేర్కొంటూ, సోషల్ మీడియా పోస్టులే ప్రామాణికం కాదని స్పష్టం చేశారు.
3. ధురంధర్ సినిమాలో రణవీర్ సింగ్ పాత్ర ఏమిటి?
రణవీర్ సింగ్ ఈ చిత్రంలో హమ్జా అలీ మజారీ అలియాస్ జస్కిరత్ సింగ్ రంగీ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


