...
...
Next Story

Deepika Padukone: దీపికా పదుకోన్ ప్రభుత్వాన్ని అంత మాట అన్నదా? ఆ వైరల్ పోస్ట్ వెనుక ఏం జరిగింది?

Deepika Padukone: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ కు మద్దతుగా దీపికా పదుకోన్ పోస్ట్ చేసిందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నిజం ఇదీ అంటూ తెరపైకి మరో వార్త వచ్చింది.

Published on: Jul 16, 2026, 11:32:31 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Deepika Padukone: లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ సపోర్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిందంటూ ఒక స్క్రీన్ షాట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై ఆమె సంచలన కామెంట్స్ చేసి, నిమిషాల్లోనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసిందని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ వైరల్ ప్రచారం వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో ఫ్యాక్ట్ చెక్‌లో తేలిపోయింది.

వైరల్ స్క్రీన్ షాట్ కథేంటి?

Deepika Padukone: దీపికా పదుకోన్ ప్రభుత్వాన్ని అంత మాట అన్నదా? ఆ వైరల్ పోస్ట్ వెనుక ఏం జరిగింది?
Deepika Padukone: దీపికా పదుకోన్ ప్రభుత్వాన్ని అంత మాట అన్నదా? ఆ వైరల్ పోస్ట్ వెనుక ఏం జరిగింది?

సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకోన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ తెగ చక్కర్లు కొడుతోంది. అందులో సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ఫోటోను రీ-షేర్ చేస్తూ.. "ఆయన ఉపవాసం చేస్తున్నారు.. మనం మాత్రం స్క్రోలింగ్ చేస్తున్నాం" అనే క్యాప్షన్ కనిపించింది.

దానితో పాటు "దీనిపై ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు? మనం ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి సమయాన్ని చూస్తున్నాం. ఫెయిల్ అయిన లీడర్‌ను కలర్ ఫుల్‌గా చూపించడానికి ఎన్ని సినిమాలు తీసినా నిజ జీవితంలో మాత్రం అది మారడం లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు రాసి ఉన్నాయి.

ఫ్యాక్ట్ చెక్ లో తేలిన నిజం ఇదే!

ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడంతో చాలామంది దీపికా నిజంగానే ప్రభుత్వంపై ఫైర్ అయిందని భావించారు. అయితే దీపికా అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కానీ, ఆమె సోషల్ మీడియా ఆర్కైవ్స్‌లో కానీ ఇలాంటి పోస్ట్ పెట్టినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరో కావాలని డిజిటల్ ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి మార్ఫింగ్ చేసిన ఫేక్ స్క్రీన్ షాట్ ఇదని స్పష్టమైంది.

మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష గురువారంతో 19వ రోజుకు చేరుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పరీక్షల పేపర్ లీక్, అక్రమాలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన ఈ దీక్ష ప్రారంభించారు.

ప్రస్తుతం సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించింది. ఆయన బరువు 57.15 కేజీలకు పడిపోయిందని, దీక్ష ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 8.9 కేజీల బరువు తగ్గారని డాక్టర్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఆయనకు తక్షణమే ఆసుపత్రిలో అత్యవసర వైద్యం అందించాలని పిటిషనర్లు కోరారు. అయితే ప్రభుత్వం వచ్చి తనతో చర్చలు జరిపే వరకు దీక్ష విరమించేది లేదని వాంగ్‌చుక్ స్పష్టం చేస్తున్నారు.

దీపికా చేసినట్లుగా చెబుతున్న పోస్ట్ ఇదే
 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe