OTT Telugu: యువ నటుడు హర్షిత్ రెడ్డి, స్నేహా మణిమేగలై ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ రోమాంటిక్ డ్రామా 'దీవానా' (Deewana). ఈ ఏడాది జూన్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే యూత్ నుంచి ఈ మూవీకి మంచి ఆదరణ వచ్చింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది.
దీవానా ఓటీటీ రిలీజ్ డేట్

దీవానా చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' (Aha) దక్కించుకుంది. జూలై 31, 2026 నుంచి ఈ సినిమా అధికారికంగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘మిస్ అయితే మస్ట్ ఫీల్ అయితవ్’ అని పేర్కొంటూ ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది ఆహా వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్.
తమిళంలోనూ
అయితే 'ఆహా గోల్డ్' (Aha Gold) సబ్‌స్క్రైబర్లకు ఈ ఓటీటీ ప్రత్యేక ఆఫర్ కలిపించింది. దీవానా సినిమాను 24 గంటల ముందే అంటే జూలై 30 నుంచే వీక్షించే అవకాశాన్ని అందించింది. థియేటర్లలో కేవలం తెలుగులోనే విడుదలైన ఈ చిత్రాన్ని, ఓటీటీ డిజిటల్ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా తమిళ భాషలో కూడా డబ్ చేసి రీలీజ్ చేస్తుండటం విశేషం.
స్టోరీ ఇదే
దీవానా మూవీ యూత్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఇది మున్నా, అమ్ము మధ్య ప్రేమ కథ చుట్టూ తిరుగుతోంది. అల్లరిచిల్లరిగా తిరిగే మున్నా ఒకసారి అమ్మును చూసి లవ్ చేస్తాడు. కానీ అమ్ము అంత ఈజీగా ఒప్పుకోదు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మాత్రం ఓకే అని కండీషన్ పెడుతుంది. దీంతో జాబ్ కోసం మున్నా ట్రై చేస్తాడు. అయితే అతను అరెస్టు అవడమే కథలో ట్విస్ట్. మున్నా ఎందుకు జైలుకు వెళ్లాడు? అమ్మును పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నదే మిగతా కథ.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో
గీతా ఆర్ట్స్ సమర్పణలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి దీవానా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నరేష్, ఝాన్సీ, జీవన్ కుమార్, 'బలగం' వేణు వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. లవ్, ఎమోషన్స్‌తో పాటు యూత్‌ను ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో తెరకెక్కడం ఈ సినిమాకు ప్రధాన బలమైంది.
ఓటీటీలో ఏం చేస్తుందో?
{{/usCountry}}గీతా ఆర్ట్స్ సమర్పణలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి దీవానా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నరేష్, ఝాన్సీ, జీవన్ కుమార్, 'బలగం' వేణు వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. లవ్, ఎమోషన్స్‌తో పాటు యూత్‌ను ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో తెరకెక్కడం ఈ సినిమాకు ప్రధాన బలమైంది.
ఓటీటీలో ఏం చేస్తుందో?
{{/usCountry}}ఓటీటీ ట్రెండ్స్, ట్రేడ్ విశ్లేషణ ప్రకారం.. థియేటర్లలో యావరేజ్ వసూళ్లు సాధించిన చిన్న బడ్జెట్ రొమాంటిక్ డ్రామాలు ఆహా వంటి రీజనల్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి డిజిటల్ వ్యూయర్‌షిప్ సాధిస్తుంటాయి. గీతా ఆర్ట్స్ బ్రాండ్ తోడుకావడం, తమిళ వెర్షన్ కూడా అందుబాటులోకి తేవడం వల్ల ఓటీటీ రన్‌లో దీవానా చిత్రానికి మరింత మైలేజ్ లభించే అవకాశం ఉంది.