...
...
Next Story

Deewana OTT: ఓటీటీలో తెలుగు రొమాంటిక్ డ్రామా రచ్చ.. మూడు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్.. ఆవారా ప్రేమ కథ

Deewana OTT: థియేటర్లలో దుమ్ము రేపిన తెలుగు రొమాంటిక్ డ్రామా దీవానా ఓటీటలోనూ దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకోవడం విశేషం.ఈ విషయాన్ని ఆహా ఓటీటీ వెల్లడించింది.

Published on: Aug 3, 2026, 14:16:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Deewana OTT: థియేటర్లలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న యంగ్ హీరో హర్షిత్ రెడ్డి లేటెస్ట్ లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'దీవానా' (Deewana) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) లో రీసెంట్‌గా ప్రీమియర్ అయిన ఈ సినిమా.. అతి తక్కువ టైమ్‌లోనే ఏకంగా 50 మిలియన్ డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ని సాధించి బిగ్గెస్ట్ మైలురాయిని చేరుకుంది.

Deewana OTT: ఓటీటీలో తెలుగు రొమాంటిక్ డ్రామా రచ్చ.. మూడు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్.. ఆవారా ప్రేమ కథ
Deewana OTT: ఓటీటీలో తెలుగు రొమాంటిక్ డ్రామా రచ్చ.. మూడు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్.. ఆవారా ప్రేమ కథ

ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌తో డిజిటల్ స్పేస్ లో ఈ మూవీ ట్రెండింగ్ టాప్‌లో దూసుకుపోతోంది.

యూత్‌ఫుల్ కంటెంట్.. హర్షిత్ రెడ్డి ఇంటెన్స్ పెర్ఫార్మన్స్

'మేమ్ ఫేమస్', 'బలగం' వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి.. 'దీవానా' సినిమాలో తన నేచురల్ పెర్ఫార్మన్స్‌తో దుమ్మురేపాడు. లవ్, ఎమోషన్, ఫన్ కలగలిపిన రోల్‌లో హర్షిత్ జీవించేయగా, హీరోయిన్‌గా నటించిన స్మేహ మణిమేగలై తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌ను బాగా ఆకట్టుకుంది.

ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచి డిజిటల్ ఆడియెన్స్‌ను విశేషంగా అలరిస్తోంది.

సీనియర్ నటుల ఫన్.. హైలైట్‌గా నిలిచిన కామెడీ ఎపిసోడ్స్

దీవానా సినిమాలో సీనియర్ యాక్టర్స్ నరేష్ విజయకృష్ణ, ఝాన్సీ తమ నటనతో కథకు మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చారు. వీరితో పాటు 'బలగం' ఫేమ్ వేణు, జీవన్ కుమార్, టోనీ అందించిన టైమింగ్ కామెడీ, నాన్‌స్టాప్ హ్యూమర్ థియేటర్లలో లాగే ఓటీటీ వీక్షకులను కూడా కడుపుబ్బ నవ్విస్తోంది. ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉండేలా కథను తీర్చిదిద్దడం సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణమైంది.

గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్.. మెస్మరైజింగ్ మ్యూజిక్

కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో 'దీవానా' సాధించిన 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ నిరూపించింది. థియేటర్లలో మిస్సయిన ఆడియన్స్ కూడా ఇప్పుడు ఆహాలో ఈ సినిమాను రిపీటెడ్‌గా చూస్తుండటంతో వసూళ్ల జోరు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కొనసాగుతోంది.

ప్రస్తుతం ఆహా ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న ఈ లవ్ ఎంటర్‌టైనర్ రాబోయే రోజుల్లో మరిన్ని వ్యూయర్ షిప్ రికార్డులను తిరగరాసేలా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks