Rithu Demon Pavan: ఎవరు ఎవరిని వాడుకోలేదు.. బిగ్ బాస్ ఫేమస్ జోడీ బ్రేకప్.. రీతూ చౌదరీపై డీమాన్ పవన్ సంచలన పోస్ట్!

Rithu Demon Pavan: తెలుగు బుల్లితెరపై, ముఖ్యంగా బిగ్ బాస్ షో ద్వారా విశేష ఆదరణ పొందిన క్రేజీ జోడీ డీమాన్ పవన్, రీతూ చౌదరి బంధానికి తెరపడింది. తమ రిలేషన్ షిప్ బ్రేకప్ అయిందని చెప్తూ డీమాన్ పవన్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ పోస్టు చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

Published on: Sep 30, 2026, 12:46:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rithu Demon Pavan: బిగ్ బాస్ హౌస్‌లోకి సామాన్యుడిగా అడుగుపెట్టి, తన ఆట తీరుతో ఫైనల్ వరకు చేరి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు డీమాన్ పవన్. అదే హౌస్‌లో రీతూ చౌదరితో అతనికున్న బాండింగ్, కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అభిమానులు వీరిద్దరినీ కలిపి 'రీవాన్' (ReVan - Rithu & Pavan) అని పిలుచుకుంటూ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టారు.

ఎవరు ఎవరిని వాడుకోలేదు.. బిగ్ బాస్ ఫేమస్ జోడీ బ్రేకప్.. రీతూ చౌదరీపై డీమాన్ పవన్ సంచలన పోస్ట్!
ఎవరు ఎవరిని వాడుకోలేదు.. బిగ్ బాస్ ఫేమస్ జోడీ బ్రేకప్.. రీతూ చౌదరీపై డీమాన్ పవన్ సంచలన పోస్ట్!

బిగ్ బాస్ బయట కూడా

బిగ్ బాస్ సీజన్ 9లో డీమాన్ పవన్, రీతూ చౌదరి పార్టిసిపేట్ చేశారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ల ఫ్రెండ్ షిప్ కొనసాగింది. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు తోడుగా ఉన్నారు. కలిసి వ్లాగ్స్ చేశారు. ట్రిప్పులు వేశారు. బీబీ జోడీ 2, కూకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 అనే రియాలిటీ షోలు చేశారు. ‘బంగారం’ అనే వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు.

రీతూతో బ్రేకప్

డీమాన్ పవన్, రీతూ చౌదరి రిలేషన్ షిప్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ షాకింగ్ గా డీమాన్ పవన్ తన ఇన్ స్టాగ్రామ్ లో బ్రేకప్ స్టోరీ పెట్టాడు. ‘‘రీవాన్ గురించి కంటిన్యూగా మెసేజ్ లు వస్తున్నాయి. రీతూ చౌదరితో నా సంబంధంపై వస్తున్న ట్రోల్స్, నెగిటివిటీ, ఫేక్ రూమర్స్ చాలా దారుణంగా ఉన్నాయి.

దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను రీతూని వాడుకున్నానని లేదా తను నన్ను వాడుకుందని కొందరు అంటున్నారు. కానీ నిజ జీవితంలో అలాంటిదేమీ లేదు. బిగ్ బాస్ లో చూసిన దానికి, బయట జరిగినదానికి సంబంధం లేదు. ఎవరు ఎవరిని వాడుకోలేదు. మాది పూర్తిగా పరస్పర గౌరవంతో కూడిన స్నేహం" అని డీమాన్ పవన్ పేర్కొన్నాడు.

​వాట్సాప్‌లో బ్లాక్.. ఇన్‌స్టాలో అన్‌ఫాలో

‘‘మా ఇద్దరికీ వ్యక్తిగత బలాలు, బలహీనతలున్నాయి. మేం గతంలో కలిసి పనిచేశాం. కానీ ఇకపై రీవాన్ అనేది ఉండదు. మా ఫ్రెండ్ షిప్ పూర్తిగా బ్రేకప్ అయింది. ఏ బంధంలోనైనా వ్యక్తిగత సమస్యలు ఉండటం సహజం. గత కొన్ని నెలలుగా మా మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. ప్రతిసారీ నేనే అర్థం చేసుకుని సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నించాను.

కానీ రోజురోజుకూ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. అందుకే వేర్వేరుగా పని చేసుకోవాలనుకున్నాం. ఆమె నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసి, స్నాప్‌చాట్‌లో డిలీట్ చేసింది. అది నాకు నచ్చలేదు. దాంతో నేను కూడా ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాను. ప్రస్తుతం ఆమె నన్ను ఇన్‌స్టాలో బ్లాక్ చేసింది" అని డీమాన్ పవన్ క్లారిటీగా చెప్పాడు.

​ఇకపై ఇద్దరం విడివిడిగానే తమ ప్రాజెక్టులపై దృష్టి పెడతామని, ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ వివరించాడు. తమకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అధ్యాయానికి ముగింపు పడుతున్నట్లు స్పష్టం చేశాడు.

డీమాన్ పవన్ ఇన్ స్టా స్టోరీ
డీమాన్ పవన్ ఇన్ స్టా స్టోరీ
  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More