ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించటం కష్టం కాకపోవచ్చు.. కానీ, ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్నల్ అందుకోవాలంటే మాత్రం నానా తిప్పలు పడాల్సిందే. ఐ లవ్ యు చెప్పిన తర్వాత ప్రేయసి ఏమంటుందోనని పడే టెన్షన్ మామూలుగా ఉండదు.
ప్రేయసి ఓకే చెప్పేస్తే

ఇలాంటి సమయంలో ప్రేమికుడికి ప్రేయసి ఓకే చెప్పేస్తే.. ఎలా ఉంటుంది.. అతని మనసు ఎలా ఊయల ఊగుతుంది. ఇద్దరు కలిసి ఎవరికీ తెలియకుండా కళ్లతో మాట్లాడుకునే మాటలు, సైగలు చూడచక్కగా ఉంటాయి.
సోషల్ డ్రామా చిత్రం
ఇలాంటి ఫీలింగ్‌ను చెప్పేలా రూపొందిన పాటే పిల్లా. తెలుగులో రూరల్ బ్యాక్‌డ్రాప్ సోషల్ డ్రామా చిత్రం దండోరా. ఇప్పటిదాకా చెప్పిన ప్రేమికులు పయనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ‘దండోరా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
కలర్ ఫొటో, బెదురులంక 2012 నిర్మాత
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రమే ‘దండోరా’.
దండోరా నటీనటులు
దండోరా సినిమాలో బిగ్ బాస్ శివాజీ, హీరో నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. దండోరా సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. దండోరా సినిమాను డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది.
పిల్లా లిరికల్ వీడియో సాంగ్
రీసెంట్గా విడుదలైన దండోరా టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. హ్యుమర్ టచ్‌తో పాటు మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాను మేకర్స్ మన ముందుకు తీసుకురాబోతున్నారనే విషయం తెలిసింది. ఇలా ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అలరించిన ‘దండోరా’ నుంచి లేటెస్ట్గా ‘పిల్లా..’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది.
పిల్లా సాంగ్ లిరిక్స్
{{/usCountry}}రీసెంట్గా విడుదలైన దండోరా టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. హ్యుమర్ టచ్‌తో పాటు మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాను మేకర్స్ మన ముందుకు తీసుకురాబోతున్నారనే విషయం తెలిసింది. ఇలా ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అలరించిన ‘దండోరా’ నుంచి లేటెస్ట్గా ‘పిల్లా..’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది.
పిల్లా సాంగ్ లిరిక్స్
{{/usCountry}}‘‘దండోరా కొట్టుకుందురో.. గుండెల్లో కొత్తగుందిరో
నింగి నేల ఇలా.. దారి కుదిరిందెలా
కళ్లారా చూడబోతినో.. కల్లోలం లాగ ఉంటదే
దాగి దాగి అలా దగ్గరైపోయావే ఇలా
పిల్లా ఇట్టసూడవే.. తొంగి నన్ను చూడవే..’’
ప్రేమికుల మనసుల్లో దాగిన
అంటూ సాగే ఈ పాట మనసుల్ని హత్తుకుంటోంది. మార్క్ కె రాబిన్ సంగీత సారథ్యం వహిస్తోన్న సినిమాలోని ఈ పాటను అదితి భావరాజు, అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటను పూర్ణా చారి రాశారు. ప్రేమికుల మనసుల్లో దాగిన భావాలను అందంగా ఆవిష్కరించిన పాట ఇది అని మేకర్స్ తెలిపారు.
టీ సిరీస్ ద్వారా రిలీజ్
ఇదిలా ఉంటే దండోరా సినిమాలోని పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. అలాగే, దండోరా సినిమాను ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్ విడుదల చేస్తోంది. దండోరా మూవీ డిసెంబర 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుందని తెలుస్తోంది.