...
...
Next Story

సామాజిక అసమానతలను ప్రశ్నించేలా దండోరా టైటిల్ సాంగ్- హార్ట్ టచింగ్‌గా పాట పల్లవి

బిగ్ బాస్ శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవికృష్ణ, నందు ప్రధాన పాత్రలు పోషించిన సోషల్ రూరల్ సెటైరికల్ ఎమోషనల్ డ్రామా సినిమా దండోరా. తాజాగా ఇవాళ శనివారం (డిసెంబర్ 13) ఈ సినిమా టైటిల్ సాంగ్ దండోరా విడుదల అయింది. సామాజిక అసమానతలను ప్రశ్నించేలా దండోరా పాట సాగింది.

Published on: Dec 13, 2025, 19:56:11 IST
Advertisement

సామాజిక అంశాలతో తెరకెక్కిన సెటైరికల్ రూరల్ కామెడీ ఎమోషనల్ సినిమా దండోరా. తాజాగా ఈ సినిమా నుంచి దండోరా టైటిల్ సాంగ్‌ను ఇవాళ శనివారం (డిసెంబర్ 13) విడుదల చేశారు. దండోరా పాటలోని పల్లవి ఎంతో ఆకట్టుకునేలా ఉంది.

దండోరా సాంగ్

సామాజిక అసమానతలను ప్రశ్నించేలా దండోరా టైటిల్ సాంగ్- హార్ట్ టచింగ్‌గా పాట పల్లవి
సామాజిక అసమానతలను ప్రశ్నించేలా దండోరా టైటిల్ సాంగ్- హార్ట్ టచింగ్‌గా పాట పల్లవి

నిను మోసినా న‌ను మోసినా

అమ్మ పేగు ఒక‌టేన‌న్నా

నిను కోసినా న‌ను కోసినా

రాలే ర‌గ‌తం ఎరుపేన‌న్నా

చిన్నా పెద్దా తేడా ఎట్లొచ్చేరా

నన్ను తొక్కే హ‌క్కు ఎవ‌డిచ్చేరా

ముట్టుకుంటే మైల ఎట్ట‌య్యెరా

కొట్టి కొట్టి గుండె డ‌ప్ప‌య్యెరా

దండోరా.. దండోరా...

అంటూ సాగే ‘దండోరా..’ మూవీ టైటిల్ సాంగ్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మార్క్ కె రాబిన్ సంగీత సార‌థ్యం వహించిన ఈ పాట‌ను కాస‌ర్ల శ్యామ్ రాశారు. ఆంథోని దాస‌న్‌, మార్క్ కె.రాబిన్ పాట‌ను పాడారు.

హార్ట్ టచింగ్‌గా సాంగ్

ఇదిలా ఉంటే, డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో దండోరా సినిమా మంచి బజ్ క్రియేట్ చేసుకుంటుంది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని దండోరా సినిమాను నిర్మించారు. దండోరా మూవీలో బిగ్ బాస్ శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవికృష్ణ, నందు, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, రాధ్య, అదితి భావరాజు కీలక పాత్రల్లో నటించారు.

దండోరా రిలీజెస్

దండోరా సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. దండోరా సినిమాను డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంటే.. ఆంధ్ర‌, సీడెడ్, క‌ర్ణాట‌క ఏరియాల్లో ప్రైమ్ షో విడుదల చేస్తోంది.

ఓవర్సీస్‌లో 200కిపైగా

అలాగే, ఓవ‌ర్సీస్‌లో 200కు పైగా థియేట‌ర్స్‌లో దండోరా మూవీ రిలీజ్ కానుంది. అక్కడ అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ గ్రాండ్‌గా దండోరా చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఓవ‌ర్సీస్‌లో అయితే డిసెంబ‌ర్ 23నే ప్రీమియ‌ర్స్ ప‌డుతున్నాయి. ఈ సినిమాలోని పాటలు టీ సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks