హిందీ సినిమాల్లో రొమాంటిక్ కలయికల విషయానికి వస్తే ధర్మేంద్ర, హేమమాలిని క్లాసిక్ జోడీ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. హేమమాలిని అందం, సొగసుకు నిదర్శనంగా నిలిచి డ్రీమ్ గర్ల్‌గా పేరుగాంచగా.. ధర్మేంద్ర తన ఆకర్షణతో, నటనతో ప్రసిద్ధి చెందాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసినప్పుడు అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయమైంది.

1970లు, 1980లలోని ప్రతి బాలీవుడ్ జానర్‌ను కవర్ చేసిన ఫిల్మోగ్రఫీ ఈ జంట సొంతం. మరి వాటిలో అభిమానులను బాగా ఆకర్షించిన టాప్ 10 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి. ప్రస్తుతం వీటిలో కొన్ని ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.
షోలే - ప్రైమ్ వీడియో
భారతీయ సినిమాల్లోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటి షోలే. ఇందులో ధర్మేంద్ర, హేమ జోడీ బాగా ఆకట్టుకుంది. ధర్మేంద్ర సరదాగా ఉండే వీరూ పాత్రలో, హేమమాలిని చురుకైన ఓ గుర్రపు బండి నడిపే గ్రామ యువతి బసంతి పాత్రలో నటించారు. వారి సహజమైన కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని ఐకానిక్‌గా మార్చింది.
ప్రతిజ్ఞ - యూట్యూబ్
1975లో వచ్చిన సినిమా ఇది. ఇది కామెడీతో కూడిన రివెంజ్ స్టోరీ. ఇందులో ధర్మేంద్ర నిరక్షరాస్యుడైన ట్రక్ డ్రైవర్ అజిత్ సింగ్‌గా నటించాడు. ఇక హేమమాలిని బలమైన రాధ పాత్ర పోషించింది. ఈ బాక్సాఫీస్ హిట్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
షరాఫత్ - యూట్యూబ్
1970లో వచ్చిన సినిమా ఇది. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి చిత్రాలలో ఒకటి. ఇందులో ధర్మేంద్ర సున్నితమైన కాలేజీ ప్రొఫెసర్ రాజేష్‌గా, హేమమాలిని పారో అనే పాత్రలో నటించారు. ఈ సోషల్ డ్రామా కూడా యూట్యూబ్ లో ఉంది.
దిల్ కా హీరా
1979లో వచ్చిన మూవీ దిల్ కా హీరా. ఈ క్రైమ్ డ్రామాలో ధర్మేంద్ర కస్టమ్స్ ఆఫీసర్ రజత్ శర్మ పాత్రలో నటించాడు. ఈ మూవీలో హేమా మాలిని ఫిమేల్ లీడ్ గా కనిపించింది.
దిల్లగీ
{{/usCountry}}1979లో వచ్చిన మూవీ దిల్ కా హీరా. ఈ క్రైమ్ డ్రామాలో ధర్మేంద్ర కస్టమ్స్ ఆఫీసర్ రజత్ శర్మ పాత్రలో నటించాడు. ఈ మూవీలో హేమా మాలిని ఫిమేల్ లీడ్ గా కనిపించింది.
దిల్లగీ
{{/usCountry}}1978లో వచ్చిన సినిమా దిల్లగీ. ఈ మరపురాని రొమాంటిక్ కామెడీలో ధర్మేంద్ర తన సాధారణ యాక్షన్ ఇమేజ్‌కు భిన్నంగా సంస్కృత ప్రొఫెసర్ స్వర్ణ్ కమల్ గా నటించాడు. హేమమాలిని డైనమిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా నటించింది.
ది బర్నింగ్ ట్రైన్
1980లో వచ్చిన సినిమా ది బర్నింగ్ ట్రైన్. ఇందులో అశోక్ సింగ్‌గా ధర్మేంద్ర, ఫిమేల్ లీడ్ గా హేమమాలిని నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేదు.
సీతా ఔర్ గీత - ప్రైమ్ వీడియో
1972లో వచ్చిన సినిమా సీతా ఔర్ గీత. హేమమాలిని డ్యుయల్ రోల్లో నటించింది. ఓవైపు సిగ్గుపడే సీతగా, మరోవైపు ధైర్యవంతురాలైన గీతగా నటించి “డ్రీమ్ గర్ల్”గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ధర్మేంద్ర సాహసోపేతమైన వీధి కళాకారుడు రాకాగా నటించాడు.
తుమ్ హసీన్ మై జవాన్ - ప్రైమ్ వీడియో
1970లో వచ్చిన సినిమా ఇది. ఈ జోడీ కలిసి నటించిన తొలి సినిమా ఇది. అక్కడి నుంచే వీళ్ల మధ్య నిజ జీవితంలో ప్రేమ చిగురించింది. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
దోస్త్ - ఎరోస్ నౌ
ధర్మేంద్ర, హేమా మాలిని లీడ్ రోల్స్ లో నటించిన మరో హిట్ మూవీ ఇది. ఈ సినిమా ప్రస్తుతం ఎరోస్ నౌ ఓటీటీలో అందుబాటులో ఉంది.
జుగ్ను - ప్రైమ్ వీడియో
ధర్మేంద్ర చురుకైన దొంగ జుగ్నుగా నటించిన యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ఇది. హేమమాలిని ఫిమేల్ లీడ్. ఓవైపు థ్రిల్లింగ్ స్టోరీతోపాటు ఈ ఇద్దరి రొమాన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.