...
...
Next Story

Celebrities Reaction: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా-సినీ సెలబ్రిటీల షాకింగ్ రియాక్షన్స్-వారణాసి హీరోయిన్ ప్రియాంక కామెంట్!

Dharmendra Pradhan Celebrities Reaction: నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ, నిర్వహణ లోపాలపై ధర్నాకు దిగిన విద్యార్థులు విజయం సాధించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంపై సినీ సెలబ్రిటీల షాకింగ్ రియాక్షన్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jul 25, 2026, 16:53:00 IST
Advertisement

Dharmendra Pradhan Celebrities Reaction: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గత కొన్ని వారాలుగా విద్యార్థులు సాగించిన పోరాటం చివరకు ఒక చారిత్రాత్మక పరిణామానికి దారితీసింది. నీట్-యుజి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం, జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) నిర్వహణ లోపాలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 25న ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా లేఖను సమర్పించారు.

సెలబ్రిటీల రియాక్షన్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా-సినీ సెలబ్రిటీల షాకింగ్ రియాక్షన్స్-వారణాసి హీరోయిన్ ప్రియాంక కామెంట్!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా-సినీ సెలబ్రిటీల షాకింగ్ రియాక్షన్స్-వారణాసి హీరోయిన్ ప్రియాంక కామెంట్!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామంపై దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు రియాక్టవుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఫాయ్ డిసౌజా చేసిన ధర్మేంద్ర రాజీనామా పోస్ట్‌కు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కామెంట్ చేసింది. 'అప్లాజ్', 'సెలబ్రేషన్', 'రెడ్ హార్ట్' ఎమోజీలతో విద్యార్థులకు సపోర్ట్ ప్రకటించింది ఈ వారణాసి హీరోయిన్.

Priyanka Chopra via Instagram.

పవర్ ఆఫ్ ది యూత్

రాహుల్ రవీంద్రన్ ఏమన్నాడంటే?

తెలుగు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టాడు. వ్యవస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు పదే పదే విఫలమైతే పర్యవసానాలు అనుభవించాల్సిందేననే బలమైన సంప్రదాయం నెలకొనాలని అభిప్రాయపడ్డాడు. దేశంలో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతులు లేవని, ప్రభుత్వ విద్య కంటే ప్రైవేట్ విద్యకే ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

శాంతియుతంగా పోరాడిన విద్యార్థులపై ప్రయోగించిన పోలీసుల దాడికి కూడా జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశాడు.

నెల రోజుల పోరాటం

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించాయి. ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు. జూలై 20న నిరసనకారులు పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించగా, పోలీసులు లారీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో వాతావరణం మరింత వేడెక్కింది.

దీంతో స్పందించిన ప్రభుత్వం.. నీట్ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేశామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ వేగవంతం చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ విద్యార్థుల నిరసనలు తగ్గకపోవడంతో ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా 'X' (ట్విట్టర్) వేదికగా తన రాజీనామా వార్తను పంచుకున్నారు. దేశంలో ఉన్న యువశక్తి భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకూడదని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రధానికి రాజీనామా లేఖ పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe