OTT Record: తెలుగు వినోద ప్రపంచంలో డ్యాన్స్ షో అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు 'ఢీ'. గడచిన 17 ఏళ్లుగా సరికొత్త టాలెంట్‌ను వెలికితీస్తూ వస్తున్న ఈ రియాలిటీ సిరీస్, ఇప్పుడు 21వ సీజన్‌తో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఈసారి ప్రతిష్టాత్మక నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్‌లలో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతుండటంతో ఓటీటీ రికార్డులు బ్రేక్ చేస్తోంది.
ఢీ 21 ఓటీటీ రికార్డు

మొదటి వారం నుంచే 'ఢీ డబుల్ ఇంపాక్ట్' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. కేవలం ఈటీవీ విన్ అందించిన అధికారిక డేటా ప్రకారం.. తొలి 2 ఎపిసోడ్‌లకు గాను 61 లక్షలకు పైగా వ్యూస్ నమోదయ్యాయి. ప్రతి ఆడియన్ యావరేజీగా 7.3 నిమిషాల ప్రసార సమయాన్ని కేటాయించారు.
స్ట్రీమింగ్ మినిట్స్
ఓటీటీలో ఢీ 21 సీజన్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఫస్ట్ 4.47 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల (44.8 Million Mins) వాచ్ టైమ్‌ను ఈ సీజన్ సొంతం చేసుకుంది. రాబోయే వారాల్లో పోటీ తీవ్రతరం అయ్యే కొద్దీ ఈ వ్యూయర్‌షిప్ సంఖ్యలు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రదీప్ మాచిరాజు హోస్టింగ్
ఈ ఢీ డబుల్ ఇంపాక్ట్ సీజన్‌కు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తన మార్కు టైమింగ్, హ్యూమర్‌తో హోస్టింగ్‌ను సరికొత్త ప్రజెంట్ చేస్తున్నారు. విచిత్రమైన కంటెస్టెంట్లు, హై-వోల్టేజ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు జడ్జ్ చేసేందుకు స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) జడ్జీలుగా ఉన్నారు. మెంటార్స్ గా తేజస్వి మడివాడ, నిఖిల్ విజయేంద్ర సింహ ఎంటర్ టైన్ చేస్తున్నారు.
డ్యాన్స్ షోకు డిమాండ్
ఓటీటీలో ఢీ 21 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈటీవీ విన్ ప్రకారం తెలుగులోనే అత్యధిక మంది చూసిన డ్యాన్స్ షోగా ఇది నిలిచింది. రియాలిటీ షోలలో సగటున 7.3 నిమిషాల వాచ్ టైమ్ సాధించడం అనేది డిజిటల్ కంటెంట్ పరంగా చాలా బలమైన ఎంగేజ్మెంట్ సూచిక. సాధారణంగా ఓటీటీలలో నాన్-స్క్రిప్టెడ్ కంటెంట్‌కి ఆడియన్స్ డ్రాప్-ఆఫ్ రేట్ ఎక్కువగా ఉంటుంది.
{{/usCountry}}ఓటీటీలో ఢీ 21 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈటీవీ విన్ ప్రకారం తెలుగులోనే అత్యధిక మంది చూసిన డ్యాన్స్ షోగా ఇది నిలిచింది. రియాలిటీ షోలలో సగటున 7.3 నిమిషాల వాచ్ టైమ్ సాధించడం అనేది డిజిటల్ కంటెంట్ పరంగా చాలా బలమైన ఎంగేజ్మెంట్ సూచిక. సాధారణంగా ఓటీటీలలో నాన్-స్క్రిప్టెడ్ కంటెంట్‌కి ఆడియన్స్ డ్రాప్-ఆఫ్ రేట్ ఎక్కువగా ఉంటుంది.
{{/usCountry}}కానీ, 'ఢీ' సాధించిన 44.8 మిలియన్ మినిట్స్ డిజిటల్ స్పేస్‌లో నాన్-ఫిక్షన్ కంటెంట్‌కు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను చాటుతోంది. రీజియనల్ ఓటీటీ అయిన ఈటీవీ విన్ వద్ద సౌత్ ఆడియన్స్ ఉండగా, నెట్‌ఫ్లిక్స్ ద్వారా మల్టీ-లింగువల్ డబ్బింగ్ ఆడియన్స్ లభిస్తున్నారు. ఈ విధానం వల్ల నిర్మాణ వ్యయం భారీగా రికవర్ అవ్వడమే కాక, కంటెంట్ లైఫ్-స్పాన్ పెరుగుతుంది.