ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాబోతోంది. ఇవాళ (డిసెంబర్ 5) నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో వస్తున్న ఈ సిరీస్ లో 50 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి వారం ఓ కొత్త ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఆ సిరీస్ పేరు ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’. ఈ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడున్నాయి.
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ ఓటీటీ

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇవాళ నుంచే స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఫస్ట్ ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది. ఆహా ఓటీటీలో తెలుగు, తమిళంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ప్రతి వారం ఒక్క ఎపిసోడ్ విడుదల అవుతుంది.
ఆహా ఒరిజినల్
ఆహా ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కింది ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్. ఇది తెలుగు, తమిళంలో అందుబాటులోకి వస్తోంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్. 50 ఎపిసోడ్ల సిరీస్ లో సస్పెన్స్ ను కొనసాగించేలా తీర్చిదిద్దినట్లు తెలిసింది. ఒకేసారి అన్ని ఎపిసోడ్లు రిలీజ్ చేయకుండా, వ్యూయర్ షిప్ ను కంటిన్యూగా కొనసాగించేందుకు వారానికి ఓ ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు.
మూడు హత్యలు
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ వెబ్ సిరీస్ రెడీ అయింది. దీనికి జెశ్విని జే డైరెక్టర్. ఒకే రాత్రి జరిగే మూడు హత్యల చూట్టూ ఈ సిరీస్ స్టోరీ సాగుతుంది. ఇందులో అశ్విన్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేశాడు. అతను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోల్ ప్లే చేశాడు. ఈ సిరీస్ లో పదిని కుమార్, ప్రీతి శర్మ, శ్రీతు క్రిష్ణన్, గురు లక్ష్మణన్ తదితరులు నటించారు.
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ స్టోరీ
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ వెబ్ సిరీస్ స్టోరీ ఒకే రాత్రి జరిగే మూడు హత్యలను సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరుగుతుంటాయి. అక్కడే మూడు హత్యలు జరుగుతాయి. వీటి ఎంక్వైరీ కోసం ఏసీపీగా అశ్విని వస్తాడు. ఆ తర్వాత అతని తండ్రి అయిన మరో ఏసీపీని రంగంలోకి దించుతారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? అన్నది సిరీస్ లో చూడాల్సిందే.
{{/usCountry}}ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ వెబ్ సిరీస్ స్టోరీ ఒకే రాత్రి జరిగే మూడు హత్యలను సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరుగుతుంటాయి. అక్కడే మూడు హత్యలు జరుగుతాయి. వీటి ఎంక్వైరీ కోసం ఏసీపీగా అశ్విని వస్తాడు. ఆ తర్వాత అతని తండ్రి అయిన మరో ఏసీపీని రంగంలోకి దించుతారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? అన్నది సిరీస్ లో చూడాల్సిందే.
{{/usCountry}}