Malayalam OTT: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సరికొత్త థ్రిల్లర్ సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. అదే.. ‘నైమార్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సుధి మాడిసన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్ 'ధూమకేతు' (Dhoomakethu).
ధూమకేతు ఓటీటీ

మలయాళ టైమ్ లూప్ కామెడీ థ్రిల్లర్ ధూమకేతు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 23, 2026 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ ఓటీటీ డెబ్యూ చేయనుందని తెలిసింది. థియేటర్లలో మిస్ అయిన వారికి హోమ్ స్క్రీన్స్‌పై ఎంజాయ్ చేయడానికి ఇది మంచి అవకాశం.
స్టోరీ ఇదే
ధూమకేతు సినిమా కథ అంతా 36 ఏళ్ల లతీన్ కుమార్ అలియాస్ కుట్టన్ (సజిన్ గోపు) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఎట్టకేలకు షర్మిల (నిఖిల విమల్) అనే అమ్మాయితో అతడికి పెళ్లి జరుగుతుంది. పెళ్లయిన ఆనందంలో శోభనం రాత్రి గడపాలని ప్లాన్ చేసుకుంటున్న సమయంలో, ఊహించని విధంగా కొందరు ముసుగు వేసుకున్న హంతకులు కుట్టన్ ఇంట్లోకి చొరబడి అతడిని దారుణంగా చంపేస్తారు.
అలాగే శర్మిలను కిడ్నాప్ చేస్తారు. కానీ, కట్ చేస్తే.. కుట్టన్ చనిపోకుండా మరుసటి రోజు ఉదయం మళ్లీ తన పెళ్లి రోజే నిద్ర లేస్తాడు. తాను కల కన్నానా లేక నిజంగానే జరిగిందా అని గందరగోళంలో పడతాడు. అయితే అదే రోజు రాత్రి మళ్లీ అదే సంఘటన జరిగి అతను చనిపోతాడు. ఇలా ఒకే రోజులో (టైమ్ లూప్‌లో) చిక్కుకుపోయిన కుట్టన్, అసలు తనను ఎవరు చంపుతున్నారు? ఆ ముసుగు దొంగల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ లూప్ నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు? అనేదే ఈ మలయాళం థ్రిల్లర్ సినిమా కథ.
మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లు
ధూమకేతు సినిమా కేవలం టైమ్ లూప్ మాత్రమే కాకుండా, ఆకాశంలో కనిపించే ఒక వింత తోకచుక్క (ధూమకేతువు) కుట్టన్ జీవితాన్ని ఎలా మార్చేసింది అనే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్‌తో ముడిపడి ఉంటుంది. ప్రతిసారి చనిపోయి లేచేటప్పుడు కుట్టన్‌కు కొత్త కొత్త ఆధారాలు దొరుకుతాయి.
{{/usCountry}}ధూమకేతు సినిమా కేవలం టైమ్ లూప్ మాత్రమే కాకుండా, ఆకాశంలో కనిపించే ఒక వింత తోకచుక్క (ధూమకేతువు) కుట్టన్ జీవితాన్ని ఎలా మార్చేసింది అనే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్‌తో ముడిపడి ఉంటుంది. ప్రతిసారి చనిపోయి లేచేటప్పుడు కుట్టన్‌కు కొత్త కొత్త ఆధారాలు దొరుకుతాయి.
{{/usCountry}}క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ ఆ ముసుగు హంతకులు ఎవరో తెలిసే ట్విస్ట్, వారి అసలు మోటివ్ ఏంటో రివీల్ అయ్యే సీన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా, ఇన్వెస్టిగేషన్ మధ్య వచ్చే ట్విస్ట్‌లు ఊహకందవు.
ఓటీటీలో ఎందుకు చూడాలి?
- హిలేరియస్ టైమ్ లూప్ కాన్సెప్ట్: సాధారణంగా టైమ్ లూప్ సినిమాలు సీరియస్‌గా సాగుతాయి. కానీ ఇందులో కేరళ నేటివిటీకి తగ్గట్టుగా పెళ్లి ఆచారాలు, బంధువుల హడావుడి మధ్య కామెడీని అద్భుతంగా పండించారు.
- నటీనటుల పర్‌ఫార్మెన్స్: 'ఆవేశం' ఫేమ్ సజిన్ గోపు తన ఎనర్జిటిక్ టైమింగ్‌తో, నిఖిల విమల్ తన క్యూట్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇక యాంటిగా నటించిన గణపతి కామెడీ టైమింగ్ సినిమాకే హైలైట్.
- పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్: షైన్ టామ్ చాకో, సిద్ధార్థ్ భరతన్ వంటి అద్భుతమైన కాస్టింగ్ ఉన్న ఈ చిత్రం సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్, నాన్‌స్టాప్ హ్యుమర్ ఇష్టపడే వారికి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.