Dhurandhar 2: రణ్‌వీర్‌ దెబ్బకు రాజమౌళి రికార్డు గల్లంతేనా? బాహుబలి 2 నిర్మాత పోస్ట్ వైరల్

Dhurandhar 2: ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ రాజమౌళి 'బాహుబలి 2' రికార్డులను సవాలు చేస్తోంది. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. 

Published on: Mar 29, 2026, 10:57:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధురంధర్ 2: ది రివెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధ్వంసం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఎస్ఎస్ రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి 2' నెలకొల్పిన తొమ్మిదేళ్ల నాటి రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఈ పరిణామం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బాహుబలి 2 ప్రొడ్యూసర్ పోస్ట్ వైరల్
బాహుబలి 2 ప్రొడ్యూసర్ పోస్ట్ వైరల్

నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్

ధురంధర్ 2 రికార్డుల వేటపై బాహుబలి చిత్రాల నిర్మాత శోభు యార్లగడ్డ ఎక్స్ పోస్ట్ వైరల్ గా మారింది. "ధురంధర్ 2 చూశా. సినిమాను పూర్తిగా ఆస్వాదించా! భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టి, కొత్త బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌లను నెలకొల్పడం చూసి చాలా సంతోషంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు" అంటూ ఆయన పోస్ట్ చేశారు.

నార్త్ అమెరికాలో కలెక్షన్లు

నార్త్ అమెరికాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా బాహుబలి 2 ($20.19 మిలియన్లు) ఉంది. బాక్స్ ఆఫీస్ మోజో ప్రకారం ధురంధర్ 2 ప్రస్తుతం $19.33 మిలియన్ల వద్ద ఉంది. శనివారం నాటి ట్రెండ్స్ చూస్తుంటే, ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేస్తుందేమోననే అంచనాలు కలుగుతున్నాయి.

MovieNorth America gross
Baahubali 2$20.19 million
Dhurandhar$19.7 million
Dhurandhar 2$19.33 million
Kalki 2898 AD$18.29 million
Pathaan$17.49 million

ధురంధర్ మేనియా

ధురంధర్ ఫ్రాంచైజీ మొత్తం కలెక్షన్లు ఇప్పుడు రూ.2000 కోట్ల మార్కును దాటేశాయి. దీంతో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' ఫ్రాంచైజీ రికార్డులను కూడా రణ్‌వీర్‌ సింగ్ సినిమా వెనక్కి నెట్టింది. 2025లో విడుదలైన ధురంధర్ పార్ట్ 1 రూ.1300 కోట్లు వసూలు చేయగా, సీక్వెల్ ధురంధర్ 2 ఇప్పుడు రూ.1200 కోట్లు దాటేసింది.

ధురంధర్ 2 గురించి

ఆదిత్య ధర్ స్వయంగా రాసి, దర్శకత్వం వహించిన ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటులు నటించారు. రణ్‌వీర్‌ సింగ్ గూఢచారి జస్కిరాత్ సింగ్ రంగీ (హమ్జా) పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.

దక్షిణాది భాషల్లోనూ

ధురంధర్ 2 కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ భారీ స్థాయిలో విడుదలైంది. దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ స్పై థ్రిల్లర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టిస్తున్న బెంచ్‌మార్క్‌లను అందుకోవడం భవిష్యత్తులో వచ్చే భారీ చిత్రాలకు సవాల్‌గా మారనుంది.

ట్రేడ్ వర్గాల విశ్లేషణ

ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే ధురంధర్ 2 కేవలం బాహుబలి 2 రికార్డును మాత్రమే కాకుండా, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి మూడు చిత్రాల జాబితాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రణ్‌వీర్‌ సింగ్ కెరీర్‌లోనే ఇది మైలురాయి లాంటి సినిమాగా నిలిచిపోనుంది. త్వరలోనే మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను ఈ చిత్రం తిరగరాయనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More