ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరి అదరగొట్టింది.
పుష్ప 2 తర్వాత

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ఆరు రోజుల్లోనే రూ.1,000 కోట్లు వసూలు చేయగా, ధురంధర్ 2 ఎనిమిది రోజుల్లో ఆ ఘనత సాధించింది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ 'పఠాన్', ప్రభాస్ 'కల్కి 2898 AD' వంటి భారీ చిత్రాల రికార్డులను ధురంధర్ 2 సినిమా అధిగమించింది.
ధురంధర్ 2 కలెక్షన్లు
మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 మూవీ మొదటి మూడు రోజుల్లో ప్రతిరోజూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో ఓపెనింగ్ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
దేశీయ బాక్సాఫీస్ వద్ద పంజా
వీక్ డేస్‌లో కూడా ధురంధర్ 2 సినిమా తన జోరును ఏమాత్రం తగ్గించకుండా నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది. గురువారం నాటికి ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.674.14 కోట్లు నెట్ (రూ.805.32 కోట్లు గ్రాస్) కు చేరుకున్నాయి.
ఓవర్సీస్‌లోనూ రణ్‌వీర్ మేనియా
విదేశీ మార్కెట్లలో కూడా ధురంధర్ 2 సంచలనం సృష్టిస్తోంది. ఎనిమిది రోజుల్లో విదేశీ మార్కెట్ల నుంచి మొత్తం రూ.261.92 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ రూ.1,067.24 కోట్లకు చేరింది. గురువారం (మార్చి 27) నాటికి ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2కు వచ్చిన ఈ కలెక్షన్లు మరో రేంజ్ లో ఉన్నాయి.
స్టార్ హీరోల రికార్డులు
ఈ భారీ వసూళ్లతో ప్రభాస్ 'కల్కి 2898 AD' (రూ.1,042 కోట్లు), షారుఖ్ ఖాన్ 'పఠాన్' (రూ.1,050 కోట్లు) రికార్డులను ధురంధర్ 2 సినిమా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు ఈ చిత్రం కన్ను 'జవాన్' (రూ.1,100 కోట్లు), 'KGF 2' కలెక్షన్లపై పడింది.
ధురంధర్ 2 గురించి
{{/usCountry}}ఈ భారీ వసూళ్లతో ప్రభాస్ 'కల్కి 2898 AD' (రూ.1,042 కోట్లు), షారుఖ్ ఖాన్ 'పఠాన్' (రూ.1,050 కోట్లు) రికార్డులను ధురంధర్ 2 సినిమా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు ఈ చిత్రం కన్ను 'జవాన్' (రూ.1,100 కోట్లు), 'KGF 2' కలెక్షన్లపై పడింది.
ధురంధర్ 2 గురించి
{{/usCountry}}2025లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'ధురంధర్' కు సీక్వెల్ గా ధురంధర్ 2 సినిమా తెరకెక్కింది. మొదటి భాగంలో పాకిస్తాన్ అండర్ వరల్డ్ లోకి హమ్జా చొరబడటాన్ని చూపిస్తే, ఈ సీక్వెల్ లో అతని అసలు మూలాలు, జస్కిరాత్ సింగ్ రంగిగా అతని ప్రయాణాన్ని చూపించారు. రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్, ఆదిత్య ధర్ టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
అగ్ర దర్శకుల ప్రశంసలు
రణ్‌వీర్ సింగ్ తో పాటు ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రంపై ఎస్.ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు ప్రశంసలు కురిపించారు.