Dhurandhar 2: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ముగించి, ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఆదిత్య ధర్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) సత్తా చాటుతోంది. కేవలం దేశీయంగానే కాకుండా ఉత్తర అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ మూవీ కనీవినీ ఎరుగని వసూళ్లను రాబడుతోంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి పది చిత్రాల జాబితాలో ‘ధురంధర్ 2’ స్థానం సంపాదించుకోవడం విశేషం.
హాలీవుడ్ దిగ్గజాలకు దీటుగా..

ప్రస్తుతం థియేటర్లలో మూడో వారం పూర్తి చేసుకుంటున్న ధురంధర్ 2.. ఇండియన్ మార్కెట్‌లో రూ.1,000 కోట్ల నెట్ (రూ.1,246 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో గల్ఫ్ దేశాల్లో విడుదల కాకపోయినప్పటికీ, నార్త్ అమెరికాలో 26 మిలియన్ డాలర్లు, మిగతా దేశాల్లో 15 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం గురువారం (ఏప్రిల్ 9) నాటికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ 178 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,656 కోట్లు) కు చేరుకుంది.
ఈ ఘనతతో ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’, ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ వంటి గ్లోబల్ హిట్స్ సరసన ‘ధురంధర్ 2’ నిలిచింది. చైనీస్ యానిమేషన్ మూవీ ‘బూనీ బేర్స్’ (139 మిలియన్ డాలర్లు) రికార్డును కూడా అధిగమించి టాప్-10 ఎలైట్ లిస్టులో చేరిపోయింది.
క్రిస్ హెమ్స్‌వర్త్, జెండయా చిత్రాల కంటే మిన్నగా..
హాలీవుడ్ అగ్ర తారల చిత్రాలను కూడా రణవీర్ సింగ్ తన వసూళ్లతో వెనక్కి నెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. క్రిస్ హెమ్స్‌వర్త్ నటించిన ‘క్రైమ్ 101’ (72 మిలియన్ డాలర్లు), రిజ్ అహ్మద్ ‘హామ్లెట్’ (78 మిలియన్ల డాలర్లు) వంటి సినిమాల కంటే ‘ధురంధర్ 2’ రెట్టింపు వసూళ్లను సాధించింది.
జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ నటించిన ‘ది డ్రామా’ సినిమా గత వారం విడుదలైనప్పటికీ, దానికంటే మెరుగైన వసూళ్లను ‘ధురంధర్ 2’ అమెరికా గడ్డపై రాబడుతోంది. కేవలం తొలి వీకెండ్ లోనే ఈ సినిమా 80 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి భారతీయ సినిమా సత్తాను చాటింది.
ధురంధర్ 2: అసలు కథేంటి?
{{/usCountry}}జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ నటించిన ‘ది డ్రామా’ సినిమా గత వారం విడుదలైనప్పటికీ, దానికంటే మెరుగైన వసూళ్లను ‘ధురంధర్ 2’ అమెరికా గడ్డపై రాబడుతోంది. కేవలం తొలి వీకెండ్ లోనే ఈ సినిమా 80 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి భారతీయ సినిమా సత్తాను చాటింది.
ధురంధర్ 2: అసలు కథేంటి?
{{/usCountry}}జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. 2025లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్. మొదటి భాగం 150 మిలియన్ డాలర్ల వద్ద ఆగిపోగా.. రెండో భాగం ఆ మార్కును అలవోకగా దాటేసింది. రణవీర్ సింగ్ అద్భుత నటనతో పాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ వంటి దిగ్గజ తారల పెర్ఫార్మెన్స్ ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది.
మొత్తానికి ఇండియన్ స్పై యాక్షన్ సినిమాలు గ్లోబల్ లెవల్‌లో హాలీవుడ్ చిత్రాలకు గట్టి పోటీనివ్వగలవని ‘ధురంధర్ 2’ నిరూపించింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది?
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 178 మిలియన్ డాలర్లు (రూ.1,656 కోట్లు) వసూలు చేసింది.
2. ఈ సినిమా ఏయే హాలీవుడ్ చిత్రాల వసూళ్లను అధిగమించింది?
క్రిస్ హెమ్స్‌వర్త్ నటించిన ‘క్రైమ్ 101’, జెండయా నటించిన ‘ది డ్రామా’, చైనీస్ యానిమేషన్ చిత్రం ‘బూనీ బేర్స్’ వంటి సినిమాల రికార్డులను ‘ధురంధర్ 2’ బ్రేక్ చేసింది.
3. ‘ధురంధర్ 2’ దర్శకుడు ఎవరు?
ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈయన ఇదివరకు ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు.
4. ఈ సినిమాలో నటించిన ప్రధాన తారలు ఎవరు?
రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు.