Dhurandhar 2 Collections: త‌గ్గేదేలే.. మూడో ప్లేస్‌కు ధురంధ‌ర్ 2.. ఛావా రికార్డు బ్రేక్‌.. ఏడో రోజూ కలెక్ష‌న్ల మోత‌

Dhurandhar 2 Collections: ర‌ణ్‌వీర్ సింగ్ ‘ధురంధ‌ర్ 2’ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో మూడో ప్లేస్ కు చేరుకుంది. ఛావా, పఠాన్, యానిమల్ రికార్డులను ధురంధర్ 2 బ్రేక్ చేసింది. 

Published on: Mar 26, 2026, 05:38:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధ‌ర్ 2: ది రివెంజ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర డామినెన్స్ కొనసాగిస్తోంది. తగ్గేదే లేదన్నట్లుగా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఏడో రోజు కూడా అదరిపోయే వసూళ్లు రాబట్టింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో ధురంధర్ 2 మూడో ప్లేస్ కు చేరుకుంది. ఆల్ టైమ్ రికార్డుపై ఈ మూవీ కన్నేసింది.

ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్ సింగ్
ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్ సింగ్

ధురంధర్ 2 కలెక్షన్లు

పాజిటివ్ టాక్ తో, సెలబ్రిటీల ప్రశంసలతో ధురంధర్ 2 కు అడ్డన్నదే లేకుండా పోయింది. ఈ సినిమా ఏడో రోజైన బుధవారం (మార్చి 25) కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. ఇండియాలో రూ.47.70 కోట్ల నెట్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది. కలెక్షన్లలో అదరగొట్టింది.

మొత్తం వసూళ్లు

ధురంధర్ 2 ఇండియా కలెక్షన్లు రూ.623.42 కోట్లకు చేరుకున్నట్లు ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ పేర్కొంది. ఏడో రోజుల్లోనే ధురంధర్ 2 సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం విశేషం. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.

ఆల్ టైమ్ హిట్స్ రికార్డులు బద్దలు

ఈ వారం రోజుల్లోనే ధురంధ‌ర్ 2 బాలీవుడ్ దిగ్గజ సినిమాల రికార్డులను తిరగరాసింది. షారుఖ్ ఖాన్ 'పఠాన్', రణ్‌బీర్ కపూర్ 'యానిమల్', సన్నీ డియోల్ 'గదర్ 2' వంటి ఇండస్ట్రీ హిట్స్ జీవితకాల వసూళ్లను ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే అధిగమించడం విశేషం. బుధవారం విక్కీ కౌశల్ 'ఛావా' (రూ.601 కోట్లు) రికార్డును కూడా ధురంధర్ 2 దాటేసింది.

మూడో ప్లేస్ కు

ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో ధురంధర్ 2 మూడో ప్లేస్ కు చేరుకుంది. ధురంధర్ పార్ట్ 1 (రూ.895 కోట్లు), స్త్రీ 2 (రూ.627 కోట్లు) మాత్రమే ధురంధర్ 2 కంటే ముందున్నాయి. ఈ మిగతా సినిమాల రికార్డులనూ ధురంధర్ 2 దాటేసేలా కనిపిస్తోంది.

ప్రస్తుత వేగం చూస్తుంటే ధురంధర్ సీక్వెల్ ఆ రికార్డును సులువుగా బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ, ర‌ణ్‌వీర్ సింగ్ మాస్ పర్ఫార్మెన్స్ ఈ స్థాయి విజయానికి ప్రధాన కారణమయ్యాయి.

దంగల్ రికార్డుకు ఎసరు?

ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి స్టార్లు ఉండటం కూడా ధురంధర్ 2 సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. ఫస్ట్ పార్ట్ ధురంధర్ 1 ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధురంధర్ 2 దాన్ని దాటేసే దిశగా సాగుతోంది.

అమీర్ ఖాన్ 'దంగల్' సృష్టించిన ఆల్ టైమ్ రికార్డ్ రూ.2070 కోట్లను కూడా ధురంధర్ 2 చిత్రం బద్దలు కొట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ర‌ణ్‌వీర్ సింగ్ సృష్టిస్తున్న ఈ ప్రభంజనం ఇప్పట్లో తగ్గేలా లేదు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More