రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. నగరంలోని నెక్స్ట్ గెలేరియా మాల్‌లోని పీవీఆర్ (PVR) మల్టీప్లెక్స్‌లో సినిమా ప్రదర్శన సమయంలో పెద్ద గొడవ జరిగింది. ఒకే షోకి హిందీ, తెలుగు వెర్షన్లకు టిక్కెట్లు అమ్మడమే ఈ వివాదానికి కారణమైంది.
ఒకే స్క్రీన్.. రెండు భాషలు

సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో వేర్వేరు భాషలకు వేర్వేరు స్క్రీన్‌లు ఉంటాయి. కానీ ఇక్కడ బుక్‌మైషో యాప్‌లో పొరపాటున ఒకే స్క్రీన్‌పై తెలుగు, హిందీ వెర్షన్లకు ధురంధర్ 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఏ భాషలో సినిమా ప్లే చేయాలనే దానిపై ప్రేక్షకులు ఒకరితో ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగారు.
థియేటర్‌లో పోలీసుల ఎంట్రీ
సినిమా స్టార్ట్ కావడానికి ముందు కాక్ టైల్ 2 మూవీ ట్రైలర్ ప్రోమో ప్లే అవుతున్న సమయంలోనే ఈ గొడవ మొదలైంది. "మేము తెలుగు వెర్షన్ టిక్కెట్లు ముందుగా బుక్ చేసుకున్నాం" అని కొందరు ప్రేక్షకులు కేకలు వేయడం వీడియోల్లో వినిపించింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ప్రేక్షకులను శాంతింపజేయాల్సి వచ్చింది.
మెట్లపై కూర్చుంటాం
తమకు నచ్చిన భాషలోనే సినిమా ప్రదర్శించాలని, లేదంటే మరో స్క్రీన్ కేటాయించాలని ప్రేక్షకులు డిమాండ్ చేశారు. ఒకవేళ వీలు కాకపోతే థియేటర్ మెట్లపై కూర్చుని అయినా సినిమా చూస్తామని యాజమాన్యాన్ని బెదిరించారు. చివరకు థియేటర్ యాజమాన్యం హిందీ వెర్షన్‌ను ప్లే చేయడంతో గొడవ సద్దుమణిగింది.
సోషల్ మీడియాలో జోకులు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "సినిమా ఇప్పటికే 4 గంటల నిడివి ఉంది, ఇప్పుడు ఇది మరో గంట అదనపు వినోదం" అని ఒకరు కామెంట్ చేశారు. "ఫస్ట్ హాఫ్ తెలుగులో, సెకండ్ హాఫ్ హిందీలో వేస్తే సరిపోతుంది కదా" అని మరొకరు సెటైర్లు వేశారు.
{{/usCountry}}ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "సినిమా ఇప్పటికే 4 గంటల నిడివి ఉంది, ఇప్పుడు ఇది మరో గంట అదనపు వినోదం" అని ఒకరు కామెంట్ చేశారు. "ఫస్ట్ హాఫ్ తెలుగులో, సెకండ్ హాఫ్ హిందీలో వేస్తే సరిపోతుంది కదా" అని మరొకరు సెటైర్లు వేశారు.
{{/usCountry}}మరికొందరు ప్రేక్షకులు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుని ఉంటే ఇలాంటి గోల ఉండేది కాదని సరదాగా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా 'ధురంధర్ 2' క్రేజ్ వల్ల ఇలాంటి గందరగోళం జరగడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ధురంధర్ 2 గురించి
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధురంధర్ 2 మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ముందుగా హిందీ వర్షన్ లోనే థియేటర్లకు వచ్చింది. కంటెంట్ డెలివరీలో ఆలస్యం కారణంగా దక్షిణాది వెర్షన్ల ప్రదర్శన వాయిదా పడింది. CBFC చివరికి మార్చి 19న డబ్బింగ్ వెర్షన్లకు క్లియరెన్స్ ఇచ్చింది. ఇతర భాషల్లో ధురంధర్ 2 మార్చి 21న రిలీజ్ అయింది. ధురంధర్ 2 మూవీ మూడు రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.