ఒక్క టికెట్ అమ్ముడుపోకుండానే రూ.250 కోట్ల లాభం.. ధురంధర్ 2 మూవీ స్పీడు మామూలుగా లేదు.. అదెలాగో తెలుసా?
రణ్‌వీర్ సింగ్ - ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న 'ధురంధర్ 2' బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించడానికి సిద్ధమైంది. మొదటి భాగం ఊహించని విజయం సాధించడంతో.. సీక్వెల్ బిజినెస్ ఆకాశాన్ని తాకింది. ఆడియో, ఓటీటీ రైట్స్ ద్వారానే సినిమా బడ్జెట్ మొత్తం వెనక్కి వచ్చేసింది.
పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ ధురందర్. గతేడాది చివర్లో విడుదలైన ఈ ఆదిత్య ధర్ మూవీ బాలీవుడ్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. మొదటి భాగం సృష్టించిన ఈ సంచలనం.. ఇప్పుడు దాని సీక్వెల్ 'ధురంధర్: ది రివేంజ్' (Dhurandhar 2) మీద అంచనాలను పీక్స్‌కి తీసుకెళ్లింది. ఎంతలా అంటే ఈ సినిమా ఒక్క టికెట్ కూడా ఇంకా అమ్మకముందే నిర్మాతలకు రూ.250 కోట్ల లాభాలు రావడం విశేషం.

ధురంధర్.. అంచనాలకు అందని గ్రోత్
సాధారణంగా సీక్వెల్స్‌కు డిమాండ్ ఉండటం సహజమే. కానీ 'ధురంధర్ 2' విషయంలో అది పదింతలు పెరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి భాగానికి, రెండో భాగానికి జరిగిన బిజినెస్ వ్యత్యాసం చూస్తే మతిపోతుంది.
మొదటి భాగం మ్యూజిక్ రైట్స్ సరిగమ సంస్థ కేవలం రూ. 20 కోట్లకు దక్కించుకుంది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు రెండో భాగం ఆడియో రైట్స్ కోసం టీ-సిరీస్ (T-Series) ఏకంగా రూ. 60 కోట్లు చెల్లించినట్లు వెరైటీ ఇండియా నివేదించింది.
ఇక మొదటి భాగాన్ని నెట్‌ఫ్లిక్స్ రూ. 85 కోట్లకు కొనుగోలు చేయగా.. ఇప్పుడు సీక్వెల్ కోసం జియోహాట్‌స్టార్ (JioHotstar) రికార్డు స్థాయిలో రూ. 150 కోట్లు వెచ్చించినట్లు బాలీవుడ్ హంగామా పేర్కొంది. అటు స్టార్ టీవీ గతంలో రూ. 25-30 కోట్లు చెల్లించగా, ఈసారి ఆ మొత్తం భారీగా పెరగనుంది.
పుష్ప రేంజ్ సక్సెస్ ఫార్ములా
గతంలో 'పుష్ప' సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. పుష్ప-1 నాన్-థియేట్రికల్ రైట్స్ రూ. 100 కోట్లకు అమ్ముడుపోతే.. క్రేజ్ పెరిగాక పుష్ప-2 బిజినెస్ రూ. 400 కోట్లు దాటింది. ఇప్పుడు 'ధురంధర్' కూడా అదే బాటలో పయనిస్తోంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం 'ధురంధర్ 2' నాన్-థియేట్రికల్ బిజినెస్ (థియేటర్ల ఆదాయం కాకుండా) సులభంగా రూ. 250 కోట్లు దాటనుంది.
ముందే వచ్చేసిన 'టేబుల్ ప్రాఫిట్'
అసలు కిటుకంతా బడ్జెట్ ప్లానింగ్‌లోనే ఉంది. మొదట దీన్ని రూ. 400 కోట్లతో ఒకే సినిమాగా తీయాలనుకున్నారు. కానీ నిడివి ఎక్కువవడంతో రెండు భాగాలుగా విడగొట్టారు. దీంతో 'ధురంధర్ 2' నిర్మాణ వ్యయం సుమారు రూ. 200 కోట్లు అయ్యింది. మార్కెటింగ్ ఖర్చులు కలుపుకున్నా, సినిమా ల్యాండింగ్ కాస్ట్ రూ. 250 కోట్లుగా ఉంది.
ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. సినిమా విడుదలకు ముందే కేవలం డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారానే రూ. 250 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. అంటే థియేటర్‌లో బొమ్మ పడకముందే నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లడమే కాకుండా లాభాల్లోకి వచ్చేశారు. ఇక థియేటర్లలో వచ్చేదంతా బోనస్ లాభమే. మొదటి భాగం రూ. 400 కోట్ల లాభం తెచ్చిపెట్టగా, రెండో భాగం దాన్ని మించే అవకాశం ఉంది.
మార్చి 19న అసలైన యుద్ధం
రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి భారీ స్టార్లతో వస్తున్న 'ధురంధర్: ది రివేంజ్' మార్చి 19న విడుదల కానుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు యశ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


