రికార్డుల వేటకు ధురంధర్ 2 రెడీ అయింది. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు సై అంటోంది. అడ్వాన్స్ టికెట్ సేల్స్ లో ధురంధర్ 2 హిస్టరీ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 ప్రీమియర్ షో టికెట్ సేల్స్ లో దూసుకెళ్తోంది.
ధురంధర్ 2

ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ధురంధర్ 2 ఒకటి. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న రిలీజ్ కానుంది. అంతకంటే ఒక రోజు ముందు మార్చి 18న ధురంధర్ 2 మూవీ ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోల టికెట్ సేల్స్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.
ఇండియాలో ఇలా
గత వారం ధురంధర్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు దేశవ్యాప్తంగా 8,337 షోలకు గాను 3.48 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం ఇప్పటివరకు దాని ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఇండియాలో రూ.18.64 కోట్లు వసూలు చేసిందని సక్నిల్క్ పేర్కొంది.
తెలుగు కలెక్షన్లు
ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం ఇండియాలో ధురంధర్ 2 ప్రీమియర్ షోలకు హిందీ డాల్బీ సినిమా ఫార్మాట్ 203 టికెట్ల నుంచి రూ.1.57 లక్షలు వచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
తమిళంలో 15,385 టికెట్ల నుంచి రూ .23.58 లక్షలు, తెలుగులో 7,827 టికెట్ల నుంచి రూ.18.54 లక్షలు, కన్నడలో వెర్షన్ 479 టికెట్ల నుంచి రూ.2.04 లక్షలు, మలయాళంలో 934 టికెట్ల నుంచి రూ.2.25 లక్షలు ఇప్పటికే ప్రీమియర్ షోల నుంచి ఖాతాలో వేసుకుంది.
ఓవర్సీస్
{{/usCountry}}తమిళంలో 15,385 టికెట్ల నుంచి రూ .23.58 లక్షలు, తెలుగులో 7,827 టికెట్ల నుంచి రూ.18.54 లక్షలు, కన్నడలో వెర్షన్ 479 టికెట్ల నుంచి రూ.2.04 లక్షలు, మలయాళంలో 934 టికెట్ల నుంచి రూ.2.25 లక్షలు ఇప్పటికే ప్రీమియర్ షోల నుంచి ఖాతాలో వేసుకుంది.
ఓవర్సీస్
{{/usCountry}}ఓవర్సీస్ లోనూ అడ్వాన్స్ టికెట్ సేల్స్ లో ధురంధర్ 2 అదరగొడుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తర అమెరికాలోనే అడ్వాన్స్ బుకింగ్స్ లో 1 మిలియన్ డాలర్లు దాటిందని సక్నిల్క్ తెలిపింది. ఈ మూవీ 2 మిలియన్ డాలర్లకు దగ్గరగా ఉందని పేర్కొంది.
యానిమల్ రికార్డు
ఓవర్సీస్ లో ప్రీమియర్ సేల్స్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా యానిమల్ రికార్డు ఉంది. ఇది 1.2 మిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుంది. ఇప్పుడీ రికార్డును ధురంధర్ 2 క్రాస్ చేసే అవకాశముంది. ఇది రణ్‌వీర్ సింగ్ వర్సెస్ రణ్‌బీర్ కపూర్ పోరుగా మారిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.