డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ధురంధర్ ది రివెంజ్ తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్స్‌కు మొత్తానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) క్లియరెన్స్ ఇచ్చేసింది. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ డబ్బింగ్ వెర్షన్స్ నిజానికి మార్చి 18న ప్రీమియర్స్, మార్చి 19న హిందీ వెర్షన్‌తో పాటు రిలీజ్ అవ్వాల్సింది. కానీ కంటెంట్ ఆలస్యం వల్ల రద్దయిన ఈ డబ్బింగ్ వెర్షన్స్ ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వస్తున్నాయి.
డబ్బింగ్ వెర్షన్స్‌కు సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

సీబీఎఫ్‌సీ వెబ్‌సైట్ ప్రకారం ధురంధర్ 2 తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్స్ సర్టిఫై అయ్యాయి. కానీ కన్నడ వెర్షన్ సర్టిఫికెట్ మాత్రం ఇంకా అప్‌లోడ్ అవ్వలేదు. ఈ మూడు వెర్షన్స్‌కు మార్చి 19న సర్టిఫికేషన్ పూర్తయింది. వీటి రన్‌టైమ్ చూసుకుంటే 3 గంటల 51 నిమిషాలు ఉంది. హిందీ వెర్షన్ రన్‌టైమ్ 3 గంటల 49 నిమిషాలు ఉంటే, దానికంటే ఈ డబ్బింగ్ వెర్షన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. హిందీ వెర్షన్‌కు మార్చి 17న ఏ సర్టిఫికెట్ రాగా, మార్చి 18న మళ్లీ రీమాడిఫికేషన్ జరిగింది. ఇప్పుడు డబ్బింగ్ వెర్షన్స్‌కు కూడా అదే ఏ సర్టిఫికేషన్ వచ్చింది.
సీబీఎఫ్‌సీ వెబ్‌సైట్‌లో పెట్టిన కథ ప్రకారం.. రెహమాన్ డకైత్ చనిపోయిన తర్వాత, ఇండియన్ ఏజెంట్ జస్కిరత్ సింగ్ రంగీ అలియాస్ హమ్జా అలీ మజారీ పాకిస్తాన్‌లోని గ్యాంగ్‌స్టర్ టెర్రర్ పొలిటికల్ నెట్‌వర్క్‌లో టాప్ పొజిషన్‌కు ఎదగాలని ప్లాన్ చేస్తాడు. తద్వారా ఇండియా శత్రువులకు శిక్ష పడేలా చేస్తాడు.
టికెట్ బుకింగ్స్ ఓపెన్.. ఏలూరు థియేటర్ సెటైర్
బుక్‌మైషోతో పాటు ఇతర టికెటింగ్ పోర్టల్స్‌లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళలో ధురంధర్ 2 కి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ కన్నడ డబ్బింగ్ వెర్షన్స్‌కు మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. మిగతా భాషలు అన్నీ మార్చి 21 మధ్యాహ్నం నుంచి థియేటర్లలోకి రానున్నాయి.
{{/usCountry}}బుక్‌మైషోతో పాటు ఇతర టికెటింగ్ పోర్టల్స్‌లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళలో ధురంధర్ 2 కి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ కన్నడ డబ్బింగ్ వెర్షన్స్‌కు మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. మిగతా భాషలు అన్నీ మార్చి 21 మధ్యాహ్నం నుంచి థియేటర్లలోకి రానున్నాయి.
{{/usCountry}}ఈ గ్యాప్‌లో ఏపీలోని ఏలూరు ఎస్‌వీసీ సినిమాస్ వాళ్లు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ భలే వైరల్ అవుతోంది. ఫైనల్లీ ధురంధర్ ద రివెంజ్ తెలుగు వెర్షన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈసారి టికెట్స్ బుక్ చేశాక.. క్యాన్సిలేషన్ అండ్ రీఫండ్ కోసం కోరకుండా సినిమా చూడండి. ఆ బాధ్యత మీదే జియో స్టూడియోస్, ఆదిత్య ధర్ అంటూ మేకర్స్‌కు గట్టిగానే కౌంటర్ వేశారు.
ఆదిత్య ధర్ ఏం చెప్పాడు?
గత బుధవారం అంటే మార్చి 18 సాయంత్రం 5 గంటల డబ్బింగ్ వెర్షన్స్ షోస్ క్యాన్సిల్ అయిన తర్వాత డైరెక్టర్ ఆదిత్య తన సోషల్ మీడియాలో సాయంత్రం 6 గంటలకు ఒక నోట్ పోస్ట్ చేశాడు. ఇండియా అంతటా హిందీ షోస్ అన్నీ షెడ్యూల్ చేసినట్లే సాయంత్రం 5 గంటల నుంచి రన్ అవుతున్నాయి. మా తమిళం, తెలుగు షోస్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఊహించని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మలయాళం, కన్నడ షోస్ రేపు ఉదయం నుంచి పడతాయి అని అందులో రాశాడు.
కానీ ఆదిత్య అలా ప్రామిస్ చేసినా కూడా మార్చి 19న ఎక్కడా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లిస్ట్ అవ్వకపోవడంతో ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. షోస్ పడకపోవడంతో చాలా థియేటర్స్ డబ్బింగ్ ప్రీమియర్స్‌కు రీఫండ్స్ ఇచ్చేశాయి. కొంతమంది మాత్రం హిందీ వెర్షన్‌ను సబ్‌టైటిల్స్‌తో చూసి అడ్జస్ట్ అయ్యారు. ఫస్ట్ పార్ట్ ధురంధర్ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యి వరల్డ్‌వైడ్‌గా రూ.1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సీక్వెల్ ఫస్ట్ డేనే రూ.240 కోట్ల భారీ ఓపెనింగ్ తెచ్చుకుంది. మరి ఈ డబ్బింగ్ వెర్షన్స్ కూడా చేరాక లాంగ్ రన్‌లో ఇది ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.